NTV Telugu Site icon

Kakinada: పిస్టల్ తో యువకుడి హల్ చల్

Pistol

Pistol

ఈమధ్యకాలంలో యువకులు మారణాయుధాలతో తిరుగుతూ కలకలం రేపుతున్నారు. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓ రాజకీయనాయకుడి బంధువు ఒకరు కత్తితో కేక్ కట్ చేసి, బర్త్ డే వేడుకల్లో హంగామా చేయడం వివాదాస్పదం అయింది. తాజాగా కాకినాడ జిల్లాలో ఓ యువకుడు పిస్టల్ పట్టుకుని హడావిడి చేశాడు. అతని ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

Breaking News : ప్రేమ విఫలమైందని మెట్రో స్టేషన్‌ నుంచి దూకిన యువతి.?

సామర్లకోట పట్టణంలో 27వ వార్డు సాయినగర్ కు చెందిన ఓ యువకుడు పిస్టల్తో ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. స్థానికంగా కలకలం రేపుతున్న ఫోటో పోలీసుల దృష్టికి వెళ్లింది. కొందరు ఈ అంశాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే విచారణ ప్రారంభించారు ఎస్‌ఐ సునీత. పిస్టల్ అసలుదా.. డమ్మీదో తెలియాల్సి ఉంది. ఆ యువకుడి ఆచూకీ గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.