NTV Telugu Site icon

Varahi Yatra: పవన్ వారాహి యాత్రకు లైన్ క్లియర్

Pawan Varahi Yatra

Pawan Varahi Yatra

Kakinada SP Satish Kumar Gives Clarity On Pawan Kalyan Varahi Yatra: జనసేనాధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై కొన్ని రోజుల నుంచి నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ వారాహి యాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. పోలీసుల తరఫు నుంచి వారాహి యాత్రకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. డీఎస్పీలు జనసేన నేతలు ఎక్కడికక్కడ టచ్‌లోనే ఉన్నారని.. పవన్ పర్యటనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేయవచ్చని క్లారిటీ ఇచ్చారు. భద్రత కారణాల దృష్ట్యా.. తాము కేవలం మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రమే అడిగామని తెలిపారు. జనసైనికులు ఎలాంటి హడావుడి చేయకుండా, సజావుగా యాత్ర జరుపుకోవాలని సూచించారు. వారాహి యాత్రకు లైన్ క్లియర్ అవ్వడంతో.. జనసైనికులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Nandamuri Balakrishna: మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మృతికి బాలయ్య సంతాపం

ఈ నేపథ్యంలో కాకినాడ జనసేన నేత కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న జనసేన వారాహి యాత్రకి అనుమతులు తీసుకున్నామని అన్నారు. పోలీసు సానుకూలంగా స్పందించి, యాత్ర నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. జనసైనికులు హడావుడి చేయకుండా, సజావుగా సభ నిర్వహించేలా సహకరించాలని కోరారు. క్రేనుల ద్వారా భారీ పూలమాల వేసే ప్రక్రియ లాంటివి లేకుండా, ప్రశాంతంగా యాత్ర చేసుకోవాలని పోలీసులు చెప్పినట్లు పేర్కొన్నారు. భద్రత దృష్ట్యా రాష్ట్ర, జిల్లా స్థాయి వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ అన్నవరం చేరుకుంటారని.. రేపు ఉదయం 9 గంటలకు వారాహికి ప్రత్యేక పూజలు చేసి, అన్నవరం వీరవెంకట స్వామిని దర్శించుకుంటారని స్పష్టం చేశారు. కత్తిపూడిలో మొదటి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.

Syria Chopper Crash: సిరియా హెలికాప్టర్ ప్రమాదం.. 22 మంది అమెరికా సైనికులకు గాయాలు