NTV Telugu Site icon

Kadiri IT Raids: కదిరిలో వడ్డీ వ్యాపారి ఇంట్లో ఐటీ దాడులు..

It1

It1

ఈమధ్యకాలంలో ఐటీ శాఖ వరుస దాడులతో కలకలం రేపుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవారి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఆదాయపన్ను శాఖ దాడులు కొందరు వ్యాపారుల్ని వణికించాయి. ఆదాయానికి మించి ఆస్తులు , పెద్ద మొత్తంలో భూములు కోనుగోలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో తిరుపతికి చెందిన ఐటి శాఖ అధికారులు వడ్డీ వ్యాపారి ఇంట్లో దాడులు నిర్వహించారు .

తుమ్మళ్లకుంటకు చెందిన రమణారెడ్డి అలియాస్ పంచె రెడ్డి 1991లో గ్రామంలో ఉన్న రెండు ఎకరాల భూమి అమ్మి వడ్డీ వ్యాపారం ప్రారంభించినట్లు తెలుస్తోంది.చిన్న చిన్నగా వడ్డీలు ఇస్తూ పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాందించినట్లు ఆరోపణలున్నాయి. రమణారెడ్డికి ఇద్దరు కుమారులలో ఒకరు సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ కాగా , మరొక కుమారుడు తండ్రికి తోడుగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. టోకు వ్యాపారుల నుంచి బడా వ్యాపార సంస్థలకు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చినట్లు సమాచారం. కదిరి పట్టణంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా లావాదేవీ వ్యవహారాలు నడుపుతున్నారని సమాచారం.

ప్రధానంగా బంగారు , రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెద్ద మొత్తంలో అప్పులు ఇచ్చి , భారీ మొత్తంలో టర్నోవర్ చేస్తున్నట్లు ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారుల దాడులు జరిగినట్లు తెలుస్తోంది .ప్రాథమికంగా పెద్ద ఎత్తున ప్రాంసరీ నోట్లు , భూముల లావాదేవీలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు బెంగుళూరులో అపార్ట్ మెంట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.లావా దేవీ వ్యవహారాలకు సంబంధించి కుటుంబ సభ్యులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. నగదు, ప్రాంసరీనోట్లు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు భారీగా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

YSRCP: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు