Nandyal: జీవితఖైదు అనుభవిస్తూ చదువులో రాణించిన ముద్దాయి.. పీజీలో గోల్డ్ మెడల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నంద్యాల: కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న మహమ్మద్ రఫీ అనే యువకుడు చదువులో సత్తా చాటాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజి కోర్సు చేసి ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. అంతేకాదు యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు. ఇది వింటుంటే మీకు స్టూడెంట్ నెం.1 మూవీ గుర్తోస్తుంది కదా. అచ్చం రీల్ కథను రీయల్ చేసి చూపించాడు నంద్యాలకు చెందని మహమ్మద్ రఫీ. కాగా స్టూడెంట్ నెం.1లో హత్య కేసులో జైలుకు వెళ్లిన హీరో.. తన తండ్రి ఆశయాన్ని నెరవర్చాలనుకుంటున్నాడు. తన తండ్రి కొరిక మేరకు జైలులో ఖైదీగా ఉంటూనే లా పట్టా పొందుతాడు. ఇప్పుడు అచ్చం అలానే మహమ్మద్ రఫీ కూడా చేసి చూపించాడు.
నంద్యాల జిల్లా సంజామల మండలం పేరు సోములకు చెందిన మాబుసా, మాబుని దంపతుల రెండో కుమారుడైన మహమ్మద్ రఫీపై ఓ కేసులో నేరరోపణ రుజువైంది. దీంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన జైలు జీవితం అనుభవిస్తున్నారు. కానీ తనకు ఇష్టమైన చదువును కొనసాగించాలని భావించాడు. జైలు అధికారుల సహకారంతో తాను అనుకున్నది సాధించాడు. హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అత్యధిక మార్కులు సాధించి బంగారు పతకం సాధించారు. ఈ నెల 28న విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సులర్ జగదీష్ నుంచి పతకాన్ని అందుకున్నారు. ఈ మేరకు బెయిల్‌పై వచ్చి గోల్డ్ మెడల్ అందుకున్న రఫీ అనంతరం తిరిగి కడప సెంట్రల్ జైలుకు వెళ్లాడు. కాగా జైలు జీవితంతో కృంగిపోకుండా అనుకున్నది సాధించిన మహమ్మద్ రఫీపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
తాజావార్తలు
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు