KA Paul Shocking Comments On AP Politics: ఏపీ రాజకీయాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కర్నూలులో ఉన్న ఆయన.. తాను, జగన్ కలిస్తే చంద్రబాబు కుప్పంలో ఓడిపోతాడని జోస్యం చెప్పారు. అసలు ప్రధాని మోడీకి, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? జగన్ ఏం చేశారని పవన్ వ్యతిరేకిస్తున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే సమయంలో.. వివేకా హత్య కేసు వ్యవహారంపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. వివేకా హత్య కేసులో చంద్రబాబు ద్రోహి అని, ఆయన్ను విచారించాలని డిమాండ్ చేశారు. అసలు చంద్రబాబుని ఎందుకు విచారించడం లేదు? సీబీఐ చంద్రబాబు తొత్తా? అని అనుమానం వ్యక్తం చేశారు.
Imran Khan: “నో-ఫ్లై” లిస్టులో ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ వదిలిపోకుండా చర్యలు..
వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని తాను లాస్ట్ మినిట్‌లో ఎంట్రీ ఇచ్చానని కేఏ పాల్ తెలిపారు. వివేకా హత్య కేసును అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించాలని, ఒక్క కోణంలో కాదని తెలిపారు. అవసరమైతే తానే వివేకా హత్య కేసులో విచారణ చేస్తానన్నారు. అవినాష్ రెడ్డి తల్లి ఆసుపత్రిలో ఉంటే.. సీబీఐ ఎందుకంత ఒత్తిడి చేస్తోందని నిలదీశారు. పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీకి బి పార్టీ అని సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. అవససమైతే తాను కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటానని, వారికి బుర్ర లేకపోతే ఏమి చేయలేనని పేర్కొన్నారు. వైసీపీ ఓటు బ్యాంక్ పడిపోయిందన్నారు. ప్రజలు తనని ఎన్నుకోకపోతే.. మూర్ఖులు, ధృరిద్రులు అడుక్కుతింటారని శాపనార్థాలు పెట్టారు. లోకేష్‌ది పాదయాత్ర కాదని, డ్రామా యాత్రం అంటూ కేఏ పాల్ ఎద్దేవా చేశారు.
Bandla Ganesh: గురూజీ విడకొట్టడంలో ఎక్స్ పర్ట్.. అంత పెద్ద మాట అనేశాడేంటీ
అంతకుముందు కూడా.. అవినాష్ రెడ్డిని అన్యాయంగా దోషిగా చిత్రీకరిస్తున్నారని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. వివేకాకు న్యాయం జరగాలని.. అదే సమయంలో నిర్దోషులను కాపాడాలని అన్నారు. కర్నూలులో చికిత్స పొందుతున్న అవినాష్ తల్లిని కూడా పరామర్శించారు. ఈ సందర్భంగానే తాను అవినాష్ రెడ్డితో ముక్కుసూటిగా మాట్లాడానని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ చెప్పారని తెలిపారు. తనని కొంతమంది దోషిగా చిత్రీకరిస్తున్నారని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ కేసు విషయంలో తాను పెద్దలతో మాట్లాడుతానని, వివేకాకు న్యాయం జరిగేలా చూస్తానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.