Site icon NTV Telugu

K.A.Paul: గ్రౌండ్ లో పెట్టాల్సిన సభ రోడ్డు మీద పెట్టారు

Ka Paul

Ka Paul

K.A.Paul: నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిన్న నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ సభలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఎనిమిమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్‌ స్పందించారు. తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభ రోడ్డుకు మీదకు రావటం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్‌ మండిపడ్డారు. కందుకూరు తొక్కిసలాట ఘటనా స్థలాన్ని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పరిశీలించారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నడిరోడ్డుపై సభ ఎలా పెడతారు? అంటూ ప్రశ్నించారు. గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభను రోడ్డుకు మీదకు రావటం వల్లే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్తే సరిపోతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు పాల్. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్ననని తెలిపారు. మృతుల పిల్లలకు ఛారిటీ ద్వారా విద్యను అందిస్తామని పాల్ తెలిపారు.

Read also: Kakani Govardhan Reddy : చంద్రబాబు అధికార దాహం వల్లే ప్రమాదం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో తన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో అపశృతి నెలకొంది. పామూరు రోడ్‌లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆయన ప్రసంగిస్తున్న సమయంలో.. సభలో గందరగోళం, తొక్కిసలాట చోటు చేసుకున్నాయి. భారీగా జనం తరలిరావడం వల్లే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎనిమంది కాలువలో పడి మృతి చెందగా.. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే కందుకూరి ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు తన సభను మధ్యలోనే ఆపేసి, ఆసుపత్రికి వెళ్లారు. బాధితుల్ని పరామర్శించారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, కొన్ని సందర్భాల్లో మనం నిమిత్తమాత్రులం అవుతామని, విధిరాత ఇలా ఉందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. వారికి పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు.
Malavika Sharma: రవితేజ హీరోయిన్ రీఎంట్రీ ఇస్తుందా?

Exit mobile version