KA PAUL: పవన్ కు రూ.1000 కోట్లిస్తా.. అలా చేస్తే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన ఆయన తెలుగు రాష్ట్రాల్లో సంచలన కామెంట్లకు కేరాఫ్ అడ్రస్. తాజాగా ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ తన జనసేన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు. గెలిపించలేకపోతే రూ.1000 కోట్ల నజారానా ఇస్తానన్నారు.
పవన్ సొంతంగా పోటీ చేసినా మరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలవడని కేఏ పాల్ తేల్చిచెప్పారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉండి బైబిల్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేఏ పాల్ అన్నారు. 42 ఎంపీ సీట్లు తానే గెలుస్తానని, హైదరాబాద్ తప్ప అన్నీ తమ పార్టీకే వస్తాయని ఆమధ్య ప్రకటించారు పాల్. అంతేకాదు, దేశానికి ప్రధానమంత్రినైపోతానని ఏవేవో కామెంట్లు చేస్తున్నాడాయన.
Also Read
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
- YS Jagan: ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం.. మరో ఏడాదిలో పాదయాత్ర..
- Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని సీట్లూ గెలిచేసి, ఇక్కడ ముఖ్య మంత్రి పదవుల్ని పంచేస్తానని కేఏ పాల్ చెబుతున్నాడు. అందులో ఓ పదవి పవన్ కళ్యాణ్‌కి ఇచ్చేస్తాడట. అంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ని కేఏ పాల్ చేసేస్తాడట. సో, పవన్ కళ్యాణ్ అభిమానులంతా ప్రజాశాంతి పార్టీకి ఓటెయ్యాలంటున్నాడు. అసలే పొత్తుల గురించి ఆప్షన్లు ఇస్తున్న పవన్ కళ్యాణ్ కి, ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసైనికులకు షాకింగ్ ట్రీట్ మంట్ ఇస్తున్నాడు ప్రజాశాంతి అధినేత కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ తరఫున అనేక స్థానాల్లో పోటీచేసి రెండంకెల ఓట్లు కూడా సాధించలేని పాల్… ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని సీఎంని చేస్తానని కాసేపు, ఎంపీని చేస్తానని మరో సారి కాకమ్మ కబుర్లు చెప్పడంపై జనసేన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.
తాజావార్తలు
-
Arunachal Pradesh: అరుణాచల్‌లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
-
Babar Azam: ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
-
Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!