సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు జస్టిస్ ఎన్వీ రమణ.. మొదట తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి రాజ్‌భవన్‌లో బస చేస్తున్నారు.. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. ఇక, యాదాద్రి వెళ్లి శ్రీ లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకున్న సీజేఐ దంపతులు.. నిర్మాణంలో ఉన్న యాదాద్రి ఆలయాన్ని పరిశీలించారు. ఇక, ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు చీఫ్ జస్టిస్ దంపతులు.. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయల్దేరిన ఆయన 8.45 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు.. ఉదయం 10.30 గంటలకు శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు..
నేడు శ్రీశైలానికి సీజేఐ ఎన్వీ రమణ..
CJI