ఏపీ హైకోర్టుపై ఇటీవల విమర్శలు చేసిన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను చంద్రబాబు పక్షమో, జగన్ పక్షమో కాదని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు.. వివిధ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు విని, సమన్యాయం అందించేందుకు ప్రయత్నించాలని మాత్రమే తాను చెప్పానని జస్టిస్ చంద్రు పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు విషయం తన వ్యాఖ్యలను పలువురు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగి ఇటీవల విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ చంద్రు… ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోందని వ్యాఖ్యానించారు. హైకోర్టు టార్గెట్ చేయడంతో ప్రభుత్వం భయపడుతోందని… దీంతో న్యాయవ్యవస్థ మరో మార్గంలో పయనిస్తోందని జస్టిస్ చంద్రు ఆరోపించారు. న్యాయవ్యవస్థపై పలువురు దూషించిన కేసును కూడా సీబీఐకి అప్పజెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. దీంతో జస్టిస్ చంద్రుపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ‘జై భీమ్’ సినిమాలో హీరో సూర్య జస్టిస్ చంద్రు పాత్రలోనే నటించిన విషయం తెలిసిందే.
