Jr NTR: కొడాలి నాని నామినేషన్ ర్యాలీలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR Flexies at Kodali Nani Nomination Rally: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు హల్చల్ చేశాయి. నిన్న పెనమలూరు నుంచి బరిలోకి దిగుతున్న మంత్రి జోగి రమేష్ నామినేషన్ ర్యాలీలో, నేడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో అభిమానులు హంగామా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఉన్న ప్లకార్డులు, జెండాలు చేతబట్టి నామినేషన్ ర్యాలీలో అభిమానులు పాల్గొన్న ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జోగి రమేష్ నామినేషన్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు హాట్ టాపిక్ అయ్యాయి. నిజానికి ఒకప్పుడు కొడాలి నాని టీడీపీలో ఉండగా జూ.ఎన్టీఆర్ కి ప్రధాన అనుచరుడు అనే పేరు ఉంది.
Nikhil: టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ.. మామ కోసం హీరో నిఖిల్ ప్రచారం
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
అయితే నాని పార్టీ మారాక తనకు నానికి స్నేహమే కానీ పొలిటికల్ గా తాను తన తాత పెట్టిన టీడీపీలోనే ఉంటానని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గన్నవరం, గుడివాడ, మైలవరం, అసెంబ్లీ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాలు చర్చలో ఉన్నాయి. ఎందుకంటే విజయవాడ ఎంపీ స్థానంలో కేశినేని నాని, కేశినేని చిన్ని మధ్య అన్నదమ్ముల సవాల్ ఉంది. ఇక గుడివాడ నుంచి ఓటమి ఎరుగని కొడాలి నాని ఐదోసారి పోటీకి దిగగా టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము బరిలోకి దిగుతున్నారు. గన్నవరం నుంచి హ్యాట్రిక్ విజయం కోసం వల్లభనేని వంశీ, టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ యార్లగడ్డ వెంకట్రావు పోటీ పడుతున్నారు. వీరు గత ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేశారు. ఇక మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, సామాన్యుడైన సర్నాల తిరుపతి రావుకి మధ్య పోరు ఆసక్తకరంగా మారింది. అంతేకాక బెజవాడ పశ్చిమ నుంచి పోటీకి దిగిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, వైసీపీ నుంచి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ షేక్ ఆసిఫ్ మధ్య పోటీపై కూడా చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!