NTV Telugu Site icon

BJP: ఏపీలో పొత్తులు, సీఎం అభ్యర్థిపై ఇప్పుడే చర్చ అనవసరం

Jp Nadda

Jp Nadda

ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ బీజేపీ కోర్ కమిటీ నేతలు సమావేశమై కీలకంగా చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటుగా పార్టీ ఎంపీలు టీజీ వెంక‌టేష్, సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్, కీలక నేతలు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, పురందేశ్వరి, జీవీఎల్ న‌ర‌సింహారావు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగ‌త‌ నిర్మాణంపై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా వైసీపీ విష‌యంలో భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌పైనా చ‌ర్చ జ‌రిగింద‌ని తెలుస్తోంది. అన్నింటి కంటే ముఖ్యంగా వ‌చ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల‌తో పొత్తుల దిశగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల‌పై కీల‌క చ‌ర్చ జ‌రిగిన‌ట్లు ప్రచారం జరుగుతోంది.

JP Nadda : మోడీ పొలిటికల్ కల్చర్ మార్చారు

అయితే ఏపీలో పొత్తులు, సీఎం అభ్యర్ధిపై ఇప్పుడే ప్రస్తావన అనవసరమని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలోనే సీఎం అభ్యర్ధులను తమ పార్టీ నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి చెందిన అభ్యర్ధులనే సీఎం అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించే సంప్రదాయం ఉందన్నారు. రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ ప్రభుత్వం పొత్తుల గురించి చర్చ పెడుతుందన్నారు. వైసీపీ మైండ్ గేమ్‌లో పడొద్దని తాను పవన్ కళ్యాణ్‌కు సూచిస్తున్నట్లు సత్యకుమార్ తెలిపారు. మైండ్ గేమ్ ఆడడంలో వైసీపీ నేతలు సిద్దహస్తులని ఆరోపిస్తూ గతంలో కోడికత్తి కేసు ఘటనను ఆయన ప్రస్తావించారు.

Show comments