NTV Telugu Site icon

Jogi Ramesh: రైతుల గోడు విన్నాం.. వారికిక మంచి రోజులు

Jogi Ramesh

Jogi Ramesh

ఏపీలో రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చింది. రైతు పక్షపాత ప్రభుత్వం తమదని చెప్పుకునే జగన్ ఎన్నో ఏళ్ళ సమస్యకు పరిష్కారం చూపారు. నిషేధిత జాబితా 22ఏ లో ఉన్న భూముల అంశానికి పరిష్కారం లభించిందన్నారు మంత్రి జోగి రమేష్. 2016 నుంచి 22ఏ కింద ఉన్న వేలాది ఎకరాల భూములు పరిష్కారానికి నోచుకోనున్నాయి. అవనిగడ్డ, నాగాయలంక ప్రాంతాల్లో సుమారు 16 వేల ఎకరాలు ఈ జాబితాలో వున్నాయి. నిషేధిత జాబితాలో ఉండటంతో క్రయ, విక్రయాలకు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటానికి సైతం అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి జోగి రమేష్.

Read ALso: UK: యూకేలో ఆర్థిక సంక్షోభం.. పస్తులు ఉంటున్న జనాలు

ఈ భూములన్నీ నిషేధిత జాబితా నుంచి ముఖ్యమంత్రి జగన్ (Cm Jaganmohan Reddy) తొలగిస్తున్న నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు అవనిగడ్డ ప్రాంత రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 వేల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంది. చంద్రబాబు హయాంలో వేలాది ఎకరాలను ఇలా నిషేధిత జాబితాలో ఉంచారన్నారు. రైతుల గోడు విని పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇవాళ్టితో రైతులకు తమ భూముల పై సర్వ హక్కులు రానున్నాయని, రైతులకు మంచి రోజులు వస్తాయన్నారు.

Read ALso: Karthi First Time Song Performance: కన్నుల్లో నీ రూపమే పాటతో అదరగొట్టిన కార్తీ