NTV Telugu Site icon

Jogi Ramesh: చంద్రబాబుని ఎవరూ నమ్మడం లేదు

Jogi1

Jogi1

ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ తారస్థాయికి చేరుకుంది. అటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీపై దాడి తీవ్రతరం చేశారు. తాజాగా గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుని ఎవరూ నమ్మడం లేదన్నారు. లక్షా ఇరవై వేల ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ జరుగుతోందన్నారు.

దేశ చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో పేదల ఇళ్ళ నిర్మాణాలు జరుగలేదు. అయినా టీడీపీ మీడియాకు ఇవి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఓ దద్దమ్మ, అసమర్ధుడు, సన్నాసి కనుకే తను అధికారంలో వున్నప్పుడు పేదలకు మంచి చేసే ఒక్క ప్రయత్నం చేయలేదు. రాష్ట్రంలో ఇళ్ళ నిర్మాణాలపై ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేస్తానన్నారు మంత్రి జోగి రమేష్.

చంద్రబాబు హయాంలో ఊరికి ఒక ఇల్లు కట్టి ఉంటారు. జగన్ ప్రభుత్వంలో ఊళ్ళకు ఊళ్ళ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఏ వర్గం చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని, రైతులు అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో చంద్రబాబుకు తగిన శాస్తి జరిగి తీరుతుందన్నారు మంత్రి జోగి రమేష్.సీఎం జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.పేదలకు ఇళ్లు కడుతుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉందని మండిపడ్డారు.

BJP President Candidate : బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు.?