Site icon NTV Telugu

Jogi Ramesh: పవన్ కళ్యాణ్.. టైం, డేట్, ప్లేస్ చెప్పు.. సింగిల్‌గా వస్తా

Jogi Ramesh On Pawan

Jogi Ramesh On Pawan

Jogi Ramesh Challenges Pawan Kalyan: చెప్పుతో కొడతానని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని నిమిషాల ముందే ముసుగు వీరుల ముసుగు తొలగిపోయిందని.. ఎప్పట్నుంచో తాము చెప్తున్నట్టుగా ముసుగు దొంగలిద్దరు ఒక చోట చేరిపోయారని విమర్శించారు. ప్రజలకి కూడా వీళ్ళ నిజ స్వరూపం తెలిసిపోయిందన్నారు. పవన్ కళ్యాణ్‌ను ప్యాకేజ్ కళ్యాణ్ అని తాను ఇప్పుడు కూడా చెప్తున్నానని.. ప్యాకేజ్ ‘స్టార్’ అనడం కొంత ఇబ్బందేనని సెటైర్లు వేశారు. సినిమాలో నటించే విధంగానే రాజకీయాల్లోనూ నటిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ తీసుకోకపోతే.. ఎప్పుడైనా నేను ముఖ్యమంత్రి అవుతానని ధైర్యంగా చెప్పావా? అని పవన్‌ని నిలదీశారు. చంద్రబాబు సంకలో పవన్ కళ్యాణ్ ఉన్నాడన్న ముసుగు ఇప్పుడు తొలగిపోయిందని పేర్కొన్నారు. సినిమా డైలాగులు ఎక్కడ చెప్పాలో తెలియక.. ఇక్కడ మాట్లాడుతున్నాడని కౌంటర్లు వేశారు.

నువ్వు చూపించిన చెప్పు ఇంతకు నీదేనా? లేక నీ యజమాని కొనిచ్చాడా? అంటూ పవన్‌ను జోగి రమేష్ ప్రశ్నించారు. 2019లో ఏపీ ప్రజల్ని మిమ్మల్ని చెప్పులు అరిగేటట్లు, చెంపలు చెళ్లుమనిపించారని.. ఎన్నికల్లో యుద్ధం చేసి ఓడిపోలేదా? అని అడిగారు. పవన్ చేతికి నిన్న ఎక్కువ ప్యాకేజీ అందినట్లుందని.. అందుకే ఎక్కువ మాట్లాడేశాడని ఆరోపించారు. విశాఖ గర్జన సక్సెస్ అవ్వడంతో.. తమపై పవన్ దాడి చేయించాడని ఆరోపణలు చేశారు. ఈరోజు ఆ సైకొలను మరింత రెచ్చగొట్టాడని అన్నారు. పవన్ కళ్యాణ్ ఓ పిచ్చికుక్క అని.. ఆయన వాగుడుతో అది తేటతెల్లమైందని తెలిపారు. అభివృద్ది ప్రతి గడపకు చేరాలని ముఖ్యమంత్రి తప పడుతున్నారన్నారు. వైసీపీ సిద్ధాంతం మూడు రాజధానులైతే.. పవన్ కళ్యాణ్‌ది మూడు పెళ్లాలా సిద్ధాంతమని విమర్శించారు. పొద్దున బీజేపీకి విడాకులిచ్చి.. ఇప్పుడు చంద్రబాబును మరోసారి పెళ్లి చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఏ పార్టీనైనా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత విడాకులు ఇవ్వడమే వీళ్ల సిద్ధాంతమని సెటైర్లు సంధించారు. మీరు మొత్తం కలసి కట్టుగా వచ్చినా.. ప్రజలు మొత్తం ఒక తాటిపైకి వచ్చారని, జగన్ అందరివాడని పేర్కొన్నారు.

ప్రజల గుండెల్లో ఉన్న జగన్‌ని ఓడించాలనేదే పవన్, చంద్రబాబు లక్ష్యమని.. అయితే వారి తపన అలాగే మిగిలిపోతుందని జోగి రమేష్ తెలిపారు. ఎంతమంది కలిసొచ్చినా జగన్‌ని కదల్చలేరన్నారు. తమకూ ఖలేజా ఉందని, తమకూ అన్ని వచ్చని అన్నారు. చంద్రబాబు ఇంటికే వెళ్లిన వాళ్లమని.. టైం, డేట్, ప్లేస్ చెప్తే తాను సింగిల్‌గానే వస్తానని.. అప్పుడు తేల్చుకుందామని సవాల్ విసిరారు. నిజంగా ప్యాకేజ్ తీసుకోకపోతే.. మంగళగిరి ఆఫీస్ ఎవరు కట్టారు? అని ప్రశ్నించారు. నిజంగా నువ్వు అచ్చమైన రాజకీయ నాయకుడివి అయితే.. దమ్ముంటే నేను ఒక్కడినే పోటా చేస్తా, ముఖ్యమంత్రి అవుతానని చెప్పు అంటూ పవన్‌ని డిమాండ్ చేశారు. నువ్వు గెలిపించిన ఒక్క ఎమ్మెల్యే కూడా నిన్ను చెప్పుతో కొట్టాడన్నారు. పవన్‌కి సిద్ధాంతాలు, ఆలోచన, ఆశయాలేవీ లేవన్నారు. అమ్ముడుపోయే తత్వంతో ఉన్న నిన్ను.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ మళ్లీ బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీజేపీతో కలిసి ఉంటూనే చంద్రబాబుతో పవన్ అక్రమ సంసారం చేశాడన్నారు. వాళ్లు పొత్తులు పెట్టుకుంటే ఏంటి? పోర్లాడితే ఏమిటని జోగి రమేష్ వ్యాఖ్యానించారు.

Exit mobile version