Site icon NTV Telugu

Jogi Ramesh : నన్ను బద్నాం చేయాలి.. వైసీపీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు..

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh : వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బద్నాం చేసి వైసీపీని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నారా వారి సారా ఎపిసోడ్‌ను బయటపెట్టిన తర్వాతే తమపై కుట్రలు మొదలయ్యాయని ఆయన అన్నారు. జోగి రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నారా వారి సారా ఎపిసోడ్ గురించి అందరికీ వివరించా. ఇబ్రహీంపట్నం తయారీ కేంద్రం వద్దకు వెళ్లి నిజాలు బయటపెట్టా. అక్కడ తయారైన సారా ప్రతి గడపకు ఎలా సరఫరా అవుతుందో ప్రజలకు చెప్పా. బాధ్యత గల పౌరుడిగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను ప్రశ్నించా. అప్పటి నుంచే దీన్ని రాజకీయ డైవర్షన్‌గా మలుస్తున్నారు” అని ఆరోపించారు.

“ఈ కేసులో నన్ను ఇరికించాలని చంద్రబాబు, లోకేష్ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. నన్ను బద్నాం చేసి వైసీపీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నా హృదయాన్ని గాయపరిచాడు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు” అని జోగి ఆవేదన వ్యక్తం చేశారు. “లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమని చెప్పా, సీబీఐ విచారణకు సిద్ధమని చెప్పినా స్పందన లేదు. తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రమాణం చేస్తానని కూడా చెప్పా. దుర్గమ్మ దగ్గర నా కుటుంబంతో సహా ప్రమాణం చేశా. నార్కో టెస్టుకైనా నేను సిద్ధమే. కానీ, ఎవ్వరూ స్పందించడం లేదు” అన్నారు.

“రిమాండ్ రిపోర్ట్‌లో నా పేరు లేదు. అయినా వాట్సాప్ చాట్ అంటూ విడుదల చేశారు. ఫేక్ వీడియోలు, ఫేక్ కాల్స్‌తో నా మీద బురద చల్లే ప్రయత్నం జరుగుతోంది. దానిపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశా. నాకు జనార్ధన్ అనే వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదు” అని స్పష్టం చేశారు. “ఏ తప్పు చేయని జోగి రమేష్ మీకు దొరికాడా? అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనుకుంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. చంద్రబాబు, లోకేష్ ఎల్లకాలం ఆ సీట్లో కూర్చోరు. చట్టం ముందుకు వచ్చి ఒకరోజు సమాధానం చెప్పాల్సిందే” అన్నారు. “మీరు న్యాయబద్ధంగా పనిచేయాలి. సిట్ అధికారులు నిజాయితీగా విచారణ జరపాలని కోరుతున్నా” అని విజ్ఞప్తి చేశారు.

IND vs AUS: బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 125 పరుగులకే ఆలౌట్..!

Exit mobile version