Vizag steel plant: విశాఖ ఉక్కు పోరాటం ఉధృతం అవుతోంది.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సుదీర్ఘ పోరాటాలు సాగుతూనే ఉన్నాయి.. కార్మికుల పోరాటానికి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచియి.. ఇక, ఇవాళ విశాఖ ఉక్కుపోరాట కమిటీ మహాపాదయాత్ర నిర్వహించింది.. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం ఆలయం వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర ఉదయం 11 గంటలకు సింహాచంలో ముగిసింది.. తొలిపావంచ దగ్గర సింహాద్రి అప్పన్నకు వినతిపత్రం సమర్పించారు జేఏసీ నేతలు.. అదరవొద్దు.. బెదరవొద్దు.. ఉక్కు సంకల్పం వీడవొద్దని ఈ సందర్భంగా కార్మికుల నినాదాలు చేశారు.
Read Also: Wife was killed: అనుమానంతో భార్య హత్య.. విషం తాగి భర్త సూసైడ్..
మరోవైపు విశాఖ ఉక్కుపోరాట కమిటీ మహాపాదయాత్రలో పాల్గొన్న మాజీ ఐపీఎస్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో భాగస్వామ్యం అవుతున్నాం.. జనం తరపున మూడు గంటలకు నేను బీడ్ వేస్తున్నాను అని ప్రకటించారు.. ఇక, ఈ రోజు జరిగిన పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందు చూపిస్తాం అని హెచ్చరించారు. ప్రైవేటీకరణ మీ విధానం అయితే.. ప్రజలు ఎలా తిప్పికొడతారో చూపిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు లక్ష్మీనారాయణ. ఇక, స్టీల్ ప్లాంట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-EOIకి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది.. అయితే, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు EOIకి వచ్చినప్పుడే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యం అంటున్నారు లక్ష్మీనారాయణ.. స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపించిన చొరవ అభినందనీయమన్న ఆయన… EOIలో భాగస్వామ్యం అవుతుందని భావిస్తున్నాను అన్నారు.. అవసరం అయితే EOIను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.. రాజకీయాలకు అతీతంగా స్టీల్ పరిరక్షణ పోరాటం సాగించాల్సిందేనని పిలుపునిచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ.