JC Prabhakar Reddy: బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయగా.. శుక్రవారం నాడు జేసీ ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఈడీ ముందు హాజరయ్యారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి ఆయన కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈడీ సోదాలు జరిగాయి. అయితే కొద్ది కాలం క్రితమే జేసీ కుటుంబం తమ ప్రైవేటు బస్సుల వ్యాపారాన్ని నిలిపివేసింది. తాజాగా ఈడీ కార్యాలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి హాజరు కావటం ఆసక్తి రేపుతోంది.
Read Also: నిమ్మ కాయ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
కాగా ఈడీ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పానని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. లారీల కొనుగోలు అంశంపై అధికారులు తనను ప్రశ్నించారని.. ఈడీ అంటేనే అందరూ భయపడతారని.. తమ లాంటి వారికి నిజాయితీని నిరూపించుకోవడానికి ఈడీ సరైన చోటు అన్నారు. లారీలు కొనుగోలు చేసిన వ్యక్తిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. అశోక్ లైలాండ్ లారీలు వ్యవహారం అన్నప్పుడు వారినే అడగాలని.. ఇది కోట్లు స్కాం ఏమీ కాదు కదా అని నిలదీశారు. మనీలాండరింగ్‌కు తాను పాల్పడలేదన్నారు. ఈడీ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానని.. ఈ కేసుతో తనకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. ఈడీ ఎప్పుడు విచారణకు పిలిచినా తాను సహకరిస్తానని స్పష్టం చేశారు.