మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది.. మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. దీంతో.. ఆయనపై 153 ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు… అయితే, కేసులపై సీరియస్‌గా స్పందించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఏవరిని రెచ్చగొట్టారని కేసు నమోదు చేశారో తెలియదని కామెంట్ చేసిన ఆయన.. కేసు పెట్టిన విషయం కూడా తనకు అనుచరుల ద్వారా తెలిసిందన్నారు.. ఏడాదిగా రెచ్చగొట్టే వాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గురించి.. ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇప్పుడేమా రెచ్చగొట్టానాని కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. అసలు, మొదటి ఎవరూ రెచ్చే వ్యాఖ్యలు చేశారో చూస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
తాజా కేసుపై స్పందించిన జేసీ.. రెచ్చగొట్టింది ఎవరు..?

JC