Site icon NTV Telugu

కోనసీమలో జనసేన నిరసన దీక్ష… అనుమతి నిరాకరణ… 

ఆంధ్రప్రదేశ్ కరోనా కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే.  ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.  ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది.  ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.  ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  రోజు రోజుకు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం పెరుగుతున్నది.  దీంతో కోనసీమలో ఈరోజు నుంచి మూడు రోజులపాటు ఆక్సిజన్ ప్లాంట్  పార్టీ నిరసన దీక్షను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.   అయితే, పోలీసులు ఈ నిరసన దీక్షకు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 144 అమలులో ఉన్నందున పోలీసులు అనుమతి నిరాకరించారు.  కోనసీమలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న చమురు, సహజవాయు సంస్థలు  సీఎస్ఆర్ నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని జనసేన డిమాండ్ చేస్తూ ఆయా సంస్థల కార్యాలయాల వద్ద నిరసన చేపట్టాలని జనసేన పిలుపునిచ్చింది.  

Exit mobile version