Site icon NTV Telugu

Janasena Party: తిరుపతిలో వినూత్న ప్రచారం.. జగన్ వస్తున్నాడు కార్లు జాగ్రత్త..!!

Kiran Royal

Kiran Royal

తిరుపతిలో జనసేన పార్టీ వినూత్నంగా నిరసన చేపట్టింది. ఇటీవల జగన్ ఒంగోలు పర్యటన సందర్భంగా ఓ కుటుంబం తిరుపతి వెళ్తుండగా రవాణాశాఖ అధికారులు బలవంతంగా కారు తీసుకెళ్లడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా సీఎం జగన్ తిరుపతి పర్యటన ఖరారు కావడంతో జనసేన పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. తిరుపతి నగరంలోని బైరాగి పట్టెడ పార్క్ వద్ద ‘జగన్ వస్తున్నాడు కార్లు జాగ్రత్త’ అంటూ వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తిరుపతి జనసేన పార్టీ ఇంఛార్జి కిరణ్ రాయల్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం జగన్ తిరుపతికి వస్తున్నారని.. అయితే సీఎం కాన్వాయ్‌కు సంబంధించి ఏ ఒక్క ట్రాన్స్‌పోర్టు అధికారి కూడా అందుబాటులో లేరని ఆరోపించారు. ఇప్పటికే ట్రావెల్స్ వారికి సంబంధించి రూ.2 కోట్ల బకాయిలు ఉన్నాయని.. దీంతో ఎవ్వరూ సీఎం కాన్వాయ్‌కు కార్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరని ఎద్దేవా చేశారు. దీంతో తిరుపతి స్థానిక ప్రజలు, తిరుమలకు వస్తున్న భక్తులు ఎవరి కార్లను వారు జాగ్రత్తగా ఉంచుకోవాలని కిరణ్ రాయల్ సూచించారు.

Nadendla Manohar: చిత్తశుద్ధి లేని చట్టాలెందుకు?

Exit mobile version