NTV Telugu Site icon

జనసేన కార్యకర్త దారుణ హత్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌ను దారుణంగా హ‌త్య చేశారు దుండ‌గులు.. తిరుపతి సమీపంలో జనసేన కార్య‌క‌ర్త సుహాన్ భాషాను అత్యంత కిరాత‌కంగా న‌రికి క‌త్తుల‌తో న‌రికి చంపారు.. తిరుప‌తిలోని పేరూరు చెరువు వద్ద భాషాపై దాడి చేసి హ‌త‌మార్చారు.. మృతుడు గాంధీపురానికి చెందిన సుహానా భాషాగా గుర్తించారు.. స‌మాచారం అందుకున్న జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.. ఇక‌, స్థానిక నేత‌ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సుహాన్ భాషాను హ‌త్య చేసి ప‌రారైన దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Read Also: కేంద్రంపై మ‌రో పోరాటం.. నేడు కేసీఆర్ వ్యూహ ర‌చ‌న‌..!