NTV Telugu Site icon

Varahi Vehicle: వారాహి జనసేన ఎన్నికల ప్రచార రథం.. అందుకే ఆ పేరు పెట్టాం..

Varahi Vehicle

Varahi Vehicle

వారాహి జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం.. వారాహితో యాత్రకు సిద్దమయ్యాం.. కానీ, వారాహి వాహనంపై పేర్ని నాని రకరకాల అననమానాలు సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్.. అయితే, జనసేన చట్టానికి లోబడే కార్యక్రమాలు చేపడుతోందన్న ఆయన.. సంస్థాగతంగా పార్టీ ఇంకా బలోపేతం కావాల్సి ఉందన్నారు.. ఇప్పటికే 9 జిల్లాల్లో సంస్థాగత పటిష్టతపై చర్యలు చేపట్టాం… వారాహి జనసేన ఎన్నికల ప్రచార రథమే.. సంస్కృతిని గౌరవించుకునే విధంగా వారాహి పేరు పెట్టామన్నారు.. మేం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల కోణంలోనే ఉంటుందని స్పష్టం చేశారు.. ఇక, ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లిలో కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టనున్నాం.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 281 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. కౌలు రైతుల దుస్థితి తెలియాలంటే సీఎం జగన్ సత్తెనపల్లి కౌలు రైతుల భరోసా యాత్ర సభకు రావాలంటూ సవాల్‌ విసిరారు.. మాచర్ల, గురజాల, పెదరూరపాడుల నుంచి ఎక్కువగా కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగాయని వెల్లడించారు.

Read Also: Wedding Video Going Viral: స్టేజ్‌పై వధువును బలవంతం చేసిన వరుడు..

గతంలో మేం ఆర్ధిక సాయం చేస్తే సీఎం జగన్ విమర్శలు చేశారు… సాయం అందుకునే రైతులు రైతులే కాదన్నారు… సీఎం జగన్ సత్తెనపల్లి జనసేన సభకు వస్తే తాను చెప్పినవన్నీ కరెక్ట్ కాదని అర్థం అవుతుందని సూచించారు నాదెండ్ల మనోహర్‌.. పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తామన్నారు… క్రాప్ హాలిడే డిక్లేర్ చేయొద్దు.. జగన్ ప్రభుత్వానికి హాలిడే ఇద్దామని చెప్పామన్న ఆయన.. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పుడు మూడో కృష్ణుడు వచ్చాడు.. స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు రూ. 8 వేల కోట్లు అంచనా అయితే.. జేఎస్ డబ్ల్యూ సంస్థకు రూ. 5 వేల కోట్ల సబ్సిడీలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. జేఎస్ డబ్ల్యూ గతంలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రయత్నించిందని విమర్శించిన ఆయన.. అటువంటి జేఎస్ డబ్ల్యూ సంస్థ కడప స్టీల్ ప్లాంట్ పెడుతుందని అంటున్నారని.. జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ద్వారా ఎవరికి లాభం..? అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ పేరుతో రాయలసీమ ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు నాదెండ్ల..

మరోవైపు, బీఆర్ఎస్ విషయంలో వైసీపీ వైఖరేంటో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు… అయితే, బీఆర్ఎస్ మీద ఆధారపడో.. సలహాదారుల మీద ఆధారపడో జనసేన పార్టీ నిర్ణయాలు ఉండబోవన్నారు.. కౌలు రైతుల దుస్థితిపై జనసేన పోరాడుతోంది.. కౌలు రైతులకు వచ్చే సబ్సిడీలు.. రుణాలు దక్కకుండా ఈ ప్రభుత్వం గండికొట్టిందని మండిపడ్డారు.. గతంలో గ్రామ సభలో కౌలు రైతులను గుర్తించాలనే తీర్మానంతో ప్రభుత్వం సాయం అందేది.. కానీ, కొత్త చట్టం తెచ్చి కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్న ఆయన.. ప్రస్తుత ప్రభుత్వంలో కౌలు రైతు గుర్తింపు కార్డు రావాలంటే మామూలు విషయం కాదని.. గత మూడేళ్లల్లో 1673 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని పార్లమెంటులో చెప్పారు.. కానీ, జగన్ అధికారంలోకి వచ్చాక.. 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు మేం గుర్తించామని తెలిపారు.. ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల్లో భరోసా నింపేలా జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నాం.. ఇప్పటి వరకు కడపతో సహా ఆరు జిల్లాల్లో కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టామని.. సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల్లో 40 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.