అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. విజయవాడలో ఇవాళ జెండా దిమ్మె విషయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొనగా.. అరెస్ట్‌లు, ఆందోళన వరకు వెళ్లింది వ్యవహారం.. అయితే. ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు నాదెండ్ల.. జెండా దిమ్మెలు ధ్వంసంతో జనసేన ప్రస్థానాన్ని ఆపగలరా? అని ప్రశ్నించారు.. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అరెస్టు అప్రజాస్వామికం అంటూ మండిపడ్డ ఆయన.. వైసీపీ దౌర్జన్యాలను జనసేన బలంగా ఎదుర్కొంటుందన్నారు.. జనసేన పార్టీ నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి పక్షాన పోరాడుతుంటే అధికార వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది ఆరోపించారు.
Read Also: Teacher Posts Recruitment: టీఎస్‌పీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ..! ప్రభుత్వం సంకేతాలు..
జనసేన జెండా దిమ్మెను వైసీపీ వాళ్లు ధ్వంసం చేయడం పాలక పక్షం వైఖరిని తెలియచేస్తోందని దుయ్యబట్టారు నాదెండ్ల మనోహర్… జనసేన జెండా చూస్తేనే భయపడి అక్కసుతో దాడి చేస్తున్నారని విమర్శించిన ఆయన… మొన్న జగ్గయ్యపేటలో, నేడు విజయవాడలో జనసేన జెండా చూసి వైసీపీ నేతలు భయపడ్డారని వ్యాఖ్యానించారు. కాగా, పోతిన మహేష్ సహా మరికొందరు జనసేన నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా.. పీఎస్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు.. పీఎస్ ముందే.. కేక్ కట్ చేసి.. పవన్ కల్యాణ్ బర్త్‌డే నిర్వహించిన విషయం తెలిసిందే.. ఇక, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళన నిర్వహించారు జనసైనికులు.
