జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతి వెళ్తున్నారు. ఆరు నెలల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో నేరుగా ఆయన పాల్గొననున్నారు. ఏపీలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై కూడా పవన్ నేడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ కానున్నారు. ఆ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నగరానికి మూడు రోజుల క్రితమే వచ్చారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్, పన్నుల పెంపు, కృష్ణాజలాల వివాదాలపై పవన్ భేటీ అనంతరం స్పందించే అవకాశాలు ఉన్నాయి.
read also : ఇవాళే కేంద్ర మంత్రివర్గం విస్తరణ.. వీరికే ఛాన్స్
దీంతోపాటు పార్టీ బలోపతానికి సంబంధించి అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు జనసేనాని. పవన్ నిన్న సాయంత్రమే నగరానికి చేరుకోవాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. తొలుత మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కరోనాతో చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తారు. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ అవుతారు. దాని తర్వాత విద్యార్థి సంఘాలు, టీచర్ల సంఘాలతో మాట్లాడి వారి నుంచి వినతి పత్రాలు తీసుకుంటారు. ప్రస్తుతానికి పవన్ పర్యటన ఒకరోజు మాత్రమే ఖరారైందని, అవసరం ఉంటే రెండో రోజు కూడా ఉంటారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు.