Site icon NTV Telugu

YS Jagan: రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు..?

Ys Jagan

Ys Jagan

YS Jagan: గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు.. మీరు పాలించడానికి అర్హులేనా?.. రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగం, పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? అని ప్రశ్నించారు. ఇక, మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త, ఒక దళితుడైనా మందా సాల్మన్‌ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు? అని క్వశ్చన్ చేశాడు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్యచేస్తారా? అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: MLA Defection Case: ఇదే స్పీకర్ కు చివరి అవకాశం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈ ఘటన ముమ్మాటికీ తమ పార్టీని భయ పెట్టడానికి మీరు, మీ పార్టీ నేతలు కొంతమంది పోలీసులు ద్వారా చేస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, మీరు అజమాయిషీ చెలాయిస్తూ, ఊళ్లో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందల మంది వైయస్సార్‌ పార్టీ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఆరోపించారు. ఇదొక్కటే కాదు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Read Also: MSVG 4 days Collcetions: థియేటర్లలో హౌస్‌ఫుల్స్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ 4 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

అయితే, ఇంత జరుగుతున్నా సిగ్గు లేకుండా మారణకాండను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా?.. అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్షల కోసం శాంతి భద్రతలను దెబ్బ తీసి హత్యా రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? అని ప్రశ్నించారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? చంద్రబాబు.. హింసా రాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు.. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

Exit mobile version