NTV Telugu Site icon

Devineni Avinash: వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

Avinash

Avinash

Devineni Avinash: వరద ప్రభావిత ప్రాంతలలో నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. రాణిగారితోట 17, 18వ డివిజన్ లలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాశ్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. నగరంలోని వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పెద్ద మనసుతో ఒక కోటీ పది లక్షల సహాయం మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు అని ఆయన తెలిపారు. యాభై వేల కుటుంబాలకు నిత్యవసర సరుకులను ఇంటి ఇంటికీ పంపిణీ చేస్తున్నాం.. తూర్పు నియోజకవర్గంలో 15, 16, 17, 18 డివిజన్ లలో వరద ప్రభావానికి గురైన నాలుగు డివిజన్ లలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ఈ వరదలకు టీడీపీ, చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం కారణం కాదా అని దేవినేని అవినాష్ ప్రశ్నించారు.

Read Also: Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు..

ఇకనైనా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు మాని పాలనపై దృష్టి పెట్టాలి అని విజయవాడ తూర్పు నియోకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఇప్పటికే వరద నష్ట ప్రభావం ప్రజలపై వుంది.. గెలుపు ఓటములుతో సంబంధం లేకుండా నిస్వార్థ సేవ చేస్తున్నాం.. 100 రోజుల కూటమి అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలు తప్ప చేసిందేమీ లేదు.. కృష్ణలంకకు రిటైనింగ్ వాల్ లేకపోతే సగం విజయవాడ మునిగిపోయేది.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతీ కుటుంబం లక్ష రూపాయలు పైగా నష్టపోయారు.. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సోషల్ మీడియా ప్రచారం చేసుకునే పనిలో ఉన్నాడు.. రిటైనింగ్ వాల్ నిర్మించిన జగన్ కు ఎప్పటికీ రుణ పడి వుంటామని ప్రజలు చెబుతున్నారు.. కుటుంబంకు అవసరమయ్యే తొమ్మిది రకాల నిత్యవసర సరుకులు కిట్ రూపంలో పంపిణీ నేడు చేస్తున్నాం.. మంత్రులే అధికారులను తిడుతున్నారంటే టీడీపీ పాలన ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు దేవినేని అవినాష్ అన్నారు.