Site icon NTV Telugu

SSLV-D2 Launch Successfully: ఇస్రో సరికొత్త అధ్యాయం.. ఎస్ఎస్ఎల్‌వీ -డీ2 ప్రయోగం విజయవంతం..

Sslv

Sslv

SSLV-D2 Launch Successfully: సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది ఇస్రో.. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాల పంపినా ఘనత సొంతం చేసుకుంది.. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఇవాళ నింగిలోకి దూసుకెళ్లింది ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 రాకెట్‌.. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో రూపొందించిన 156.3 కిలోల బరువు గల భూ పరిశీలన ఉపగ్రహం EOS-07, దేశీయ బాలికల ద్వారా స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ రూపొందించిన 8.7కిలోల బరువు గల ఆజాదీశాట్‌-02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువు గల జానూస్‌-01 ఉపగ్రహాన్ని రోదసీ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది ఇస్రో.. ఇప్పటికే ఎన్నో ప్రయోగాలతో అంతరిక్షంతో సత్తా చాటిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇవాళ చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసింది..

Read Also: Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ రూట్‌లో ఈ రైళ్లు రద్దు..

ఎస్ఎస్ఎల్‌వీ -డీ2కి శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.. ఇది 6.30 గంటలపాటు కొనసాగి ఉదయం 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.. ఆ తర్వాత 13 నిమిషాల 2 సెకన్ల కాలంలో విజయవంతంగా అన్ని ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.. గత ఏడాది ఆగస్టు 7న ప్రయోగత్మకంగా నిర్మించి ప్రయోగించిన మొదటి ఎస్ఎస్ఎల్‌వీ రాకెట్ సాంకేతిక సమస్య వలన సరైన కక్షలోనికి ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేకపోయింది ఇస్త్రో.. అయితే, లోపాలను సరిదిద్దిన తర్వాత ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2 రాకెట్ ను రూపొందించారు శాస్ర్తవేత్తలు.. అడ్వాన్స్ టెక్నాలజీతో వున్నా ఈ రాకెట్ ద్వారా మనదేశానికి సంబందించిన భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్‌-02 తోపాటు మరో రెండు చిన్న ఉపాగ్రహాలను భూమధ్య రేఖకి 450 కిలోమీటర్లు ఎత్తులోని భూ వృతకార కక్షలోనికి ప్రవేశపెట్టారు.. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబంరాల్లో మునిగిపోయారు. ఈ ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నిశితంగా వీక్షించాయి.. చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి భారతదేశం వైపు చూస్తున్న కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో మూడు పేలోడ్‌లతో అంతరిక్ష నౌక శ్రీహరికోట తీరం నుండి ప్రయోగించింది. లాంచ్-ఆన్-డిమాండ్ ప్రాతిపదికనలో ఎర్త్ ఆర్బిట్స్‌కు 500 కిలోల వరకు ఉపగ్రహాలను ప్రయోగించడానికి అందిస్తుంది. చిన్న శాటిలైట్ లాంచ్ మార్కెట్‌కు అనుగుణంగా కొత్తగా అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ (ఎస్ఎస్ఎల్‌వీ)ని పరిచయం చేసింది ఇస్రో.. పేరు సూచించినట్లుగా చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడం మరియు అంతరిక్షంలోకి వెళ్లే పెద్ద మిషన్‌ల కోసం భారీగా ఉపయోగించే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV)ని విడుదల చేయడం అనే ఏకైక ఉద్దేశ్యంతో ఇది అభివృద్ధి చేసింది ఇస్రో..

Exit mobile version