SSLV D2: ఎన్నో ప్రయోగాలతో అంతరిక్షంతో సత్తా చాటిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2ని ఇవాళ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇక, దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రారంభమైంది. ఇది 6.30 గంటలపాటు కొనసాగి ఉదయం 9.18 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 నింగిలోకి ప్రయోగించనున్నారు..
Read Also: Turkey Earthquake: టర్కీ భూకంపంలో 21 వేలకు చేరిన మరణాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
గత ఏడాది ఆగస్టు 7న ప్రయోగత్మకంగా నిర్మించి ప్రయోగించిన మొదటి ఎస్ఎస్ఎల్‌వీ రాకెట్ సాంకేతిక సమస్య వలన సరైన కక్షలోనికి ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేకపోయింది ఇస్త్రో.. అయితే, లోపాలను సరిదిద్దిన తర్వాత ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2 రాకెట్ ను రూపొందించారు శాస్ర్తవేత్తలు.. అడ్వాన్స్ టెక్నాలజీతో వున్నా ఈ రాకెట్ ద్వారా మనదేశానికి సంబందించిన భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-02 తోపాటు మరో రెండు చిన్న ఉపాగ్రహాలను భూమధ్య రేఖకి 450 కిలోమీటర్లు ఎత్తులోని భూ వృతకార కక్షలోనికి ప్రవేశపెట్టనున్నారు.. ఇక, శ్రీహరిలో షార్‌లో రాకెట్ కౌంట్ డౌన్ ప్రక్రియను పరిశీలించారు ఇస్రో చైర్మన్ సోమనాథ్.. ప్రయోగం విజయవంతమైతే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే దేశంగా భారత్ సరికొత్త రికార్డు నమోదు చేయనుంది.. రాకెట్ ద్వారా ఇస్రో రూపొందించిన 156.3 కిలోల బరువు గల భూ పరిశీలన ఉపగ్రహం EOS-07, దేశీయ బాలికల ద్వారా స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ రూపొందించిన 8.7కిలోల బరువు గల ఆజాదీశాట్-02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువు గల జానూస్-01 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నిశితంగా వీక్షించబడే రెండవ ప్రదర్శన మిషన్ శుక్రవారం ఉదయం 9:18 గంటలకు షెడ్యూల్ చేయబడింది. చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి భారతదేశం వైపు చూస్తున్న కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో మూడు పేలోడ్‌లతో అంతరిక్ష నౌక శ్రీహరికోట తీరం నుండి ప్రయోగించబడుతుంది. SSLV మూడు ఉపగ్రహాలను మొత్తం 334 కిలోల పేలోడ్ ద్రవ్యరాశితో 450 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో మోహరిస్తుంది. SSLV ‘లాంచ్-ఆన్-డిమాండ్’ ప్రాతిపదికనలో ఎర్త్ ఆర్బిట్స్‌కు 500 కిలోల వరకు ఉపగ్రహాలను ప్రయోగించడానికి అందిస్తుంది. ఈ ప్రయోగాన్ని ఇస్రో మిషన్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.. చిన్న శాటిలైట్ లాంచ్ మార్కెట్‌కు అనుగుణంగా కొత్తగా అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ)ని పరిచయం చేసింది ఇస్రో.. పేరు సూచించినట్లుగా చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడం మరియు అంతరిక్షంలోకి వెళ్లే పెద్ద మిషన్‌ల కోసం భారీగా ఉపయోగించే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV)ని విడుదల చేయడం అనే ఏకైక ఉద్దేశ్యంతో ఇది అభివృద్ధి చేయబడింది.
