సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సచివాలయానికి వచ్చారు.. యూనిఫాంలో సెక్రటేరియట్‌కు వచ్చారు ఏబీవీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిశారు.. ఇక, ఏబీ వెంకటేశ్వపరావుకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే కాగా… సుప్రీం కోర్టు ఆదేశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు ఏబీవీ.. ఈ సందర్భంగా ఓ లేఖను సీఎస్‌కు సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. సీఎస్ సమీర్ శర్మకు రిపోర్ట్ చేయడానికి వచ్చానని తెలిపారు ఏబీ వెంకటేశ్వరరావు.. నా పోస్టింగ్, పెండింగ్ జీత భత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లానని.. అవసరమైన ఆదేశాలివ్వాలని కోరినట్టు వెల్లడించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రిపోర్ట్ చేశాను.. లెటర్ ఇచ్చాను.. పోస్టింగ్ విషయం ప్రాసెసులో పెడతారని తెలిపారు ఏబీ వెంకటేశ్వరరావు.
Read Also: Gudivada Amarnath: కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్.. బస్సులు పంపండి..!
ఇక, ఏబీ వెంకటేశ్వరరావు లోఖలో పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే.. సస్పెన్షన్ రివోక్ చేయాలన్న సుప్రీం ఆదేశాలను.. తన సస్పెన్షన్ నుంచి సుప్రీం ఆదేశాల వరకు జరిగిన పరిణామాలను లేఖలో సీఎస్‌కు వివరించారు.. సుప్రీం ఆదేశాల మేరకు రిపోర్ట్ చేస్తున్నట్టు లేఖలో స్పష్టం చేశారు. పోస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఏ పోస్టింగుకు తాను అర్హుడినని ప్రభుత్వం భావిస్తుందో.. ఆ పోస్టింగ్ వేయాలని లేఖలో కోరారు.. పెండింగ్ జీతభత్యాల చెల్లింపుల విషయంలో తగు చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. మరి ఏబీవీ పోస్టింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.