NTV Telugu Site icon

Inter Exams: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. వార్షిక పరీక్షల ఫీజు గడువు పొడిగింపు..

Untitled 8

Untitled 8

Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. జరగబోయే వార్షిక పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. వివరాల లోకి వెళ్తే.. ఏపీలో ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 2024 మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు 2024 మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు డిసెంబరు 5 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

Read also:Minister Meruga Nagarjuna: జగన్ ప్రభుత్వంలో దళితుల తలరాతలు మారాయి..

ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు 2024 మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఉన్న గడువు నవంబరు 30వ తేదీతో ముగిసిందని.. ఈ నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం కోసం ఫీజు చెల్లించాల్సిన గడువును మరో 5 రోజులు పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుందని.. కావున విద్యార్థులు డిసెంబరు 5 వరకు ఎలాంటి ఆలస్యం రుసుం చెల్లించకుండానే ఎగ్జామ్ ఫీజులు చెల్లించవచ్చని ఆయన తెలిపారు. కాగా డిసెంబరు 5వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించని యెడల రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబరు 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు ఉందని వెల్లడించారు. కనుక ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుం చెల్లించకుండానే డిసెంబరు 5వ తేదీ వరకు వార్షిక పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించు కోవాల్సిందిగా ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ సూచించారు.