NTV Telugu Site icon

Intelligence vs Police: జిల్లా ఎస్పీలకు ఇంటెలిజెన్స్‌ డీజీ నుంచి ఆదేశాలు.. డీజీపీ తీవ్ర అభ్యంతరం..!

Intelligence Dg Vs Dgp

Intelligence Dg Vs Dgp

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెలిజెన్స్‌ వర్సెస్‌ పోలీసుగా మారిపోయిందట పరిస్థితి.. జిల్లా ఎస్పీలకు కొన్ని విషయాల్లో నేరుగా ఇంటెలిజెన్స్ డీజీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయట.. అయితే, ఈ వ్యవహారం పోలీస్‌ బాస్‌కు రుచించడంలేదు.. జిల్లా ఎస్పీలకు ఇంటెలిజెన్స్ డీజీ నేరుగా ఆదేశాలు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి… ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవటం సరికాదని పేర్కొంటూ మెమో జారీ చేశారు. జిల్లా ఎస్పీలకు నేరుగా ఆదేశాలు జారీ చేసిన ఇంటెలిజెన్స్ డీజీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంకేసిన డీజీపీ… తమ అనుమతి లేకుండా జిల్లా ఎస్పీలకు ఇంటెలిజెన్స్ చీఫ్ కార్యాలయం ఎలా ఆదేశాలు జారీ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు..

Read Also: Nara Brahmani : వావ్‌.. నారా బ్రహ్మణిలో మరో టాలెంట్‌.. లడక్‌లో బైక్‌ రైడింగ్‌ వీడియో..

ఇకపై డీజీపీ కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా ఆదేశాలు పాటించొద్దని స్పష్టం చేశారు.. ఈ మేరకు జిల్లాల ఎస్పీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది డీజీపీ కార్యాలయం. అంతేకాదు, ఇక నుంచి ఎస్పీలకు నేరుగా ఆదేశాలు జారీ చేయొద్దని ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా డీజీపీ కార్యాలయం సూచించింది.. ఎస్పీలకు చేరవేయాల్సిన సమాచారం ఏదైనా ఉంటే ముందుగా డీజీపీ కార్యాలయానికి తెలియచేయాలని స్ఫష్టం చేశారు.. ఈమేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ కార్యాలయానికి, జిల్లా ఎస్పీలకు సూచనలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ కార్యాలయం. మొత్తంగా ఈ వ్యవహారం ఇంటెలిజెన్స్‌ డీజీ వర్సెస్‌ పోలీస్‌ బాస్‌గా మారిపోయింది.