Rajamahendravaram: తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నసభలో అపశృతి చోటు చేసుకుంది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పింఛన్ కానుక సభకు విచ్చేసిన 70 ఏళ్లకు పైగా ఉన్న వృద్ధురాలు.. బస్సు నుండి దిగుతూ జారిపడిపోయింది.. ఆ వెంటనే పక్కనే ఉన్న మరో వాహనం ఆ వృద్ధురాలు మీదకు ఎక్కడంతో తీవ్ర గాయాలపాలైంది.. వృద్ధురాలి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో.. అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు.. ఆ వృద్ధురాలిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. కాగా, ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరులో నిర్వహించిన సభలో దురదృష్టకర సంఘటన చోటు చేసుకుని 8 మంది మృతిచెందగా.. ఆ తర్వాత గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మరో ముగ్గురు ప్రాణాలు విడిచిన విషయం విదితమే.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్