NTV Telugu Site icon

Krishna District: కృష్ణాజిల్లాలో అమానుషం.. పెద్ద మనుషుల మాట వినలేదని గ్రామం నుంచి వెలి

Ap

Ap

Krishna District: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణాజిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పంచాయతీ తీర్మానం సందర్భంగా గ్రామ పెద్ద మనుషులు చెప్పిన మాట వినలేదని రెండు కుటుంబాలను గ్రామం నుంచి వెలి వేశారు. ఆ కుటుంబాలతో ఎవరు మాట్లాడకూడదని షరతు విధించి చాటింపు వేయించారు పెద్దమనుషులు. వారితో ఎవరైనా మాట్లాడిన విషయాన్ని చెబితే వారికి రూ. 500 బహుమతి కూడా ఇవ్వనున్నట్టు గ్రామ పెద్దమనుషులు చాటింపు వేయించారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం అన్నవరం గ్రామంలో ఘటన జరిగింది.

Read also: CM YS Jagan: రేపు కోనసీమ జిల్లాకు సీఎం జగన్‌.. విషయం ఇదే..

గ్రామంలో రెండు కుటుంబాలకు స్థల వివాదం వచ్చింది. స్థలం వివాదాన్ని గ్రామ పెద్దలు పరిష్కరించే క్రమంలో పెద్ద మనుషుల మాటలను తిరస్కరించినందుకు తుమ్మ వెంకట సీతారామయ్య కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసినట్లు గ్రామ పెద్దలు చాటింపు వేయించారు. చాటింపును వీడియో తీసిన రామకృష్ణ కుటుంబాన్ని కూడా వెలివేస్తున్నట్లు గ్రామ పెద్దలు ప్రకటించారు. ఈ విషయాన్ని చాటింపు వేయించారు. చాటింపును వీడియో తీసిన రామకృష్ణ రావి వారి పాలెం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.

Read also: Vishwak sen : ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్న విశ్వక్ సేన్..!!

గ్రామం నుంచి వెలివేసిన రెండు కుటుంబాలతో మాట్లాడిన వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించినట్టు గ్రామ పెద్దలు ప్రకటించారు. వారితో ఎవరైనా మాట్లాడితే చెప్పినందుకు వారికి రూ. 500 బహుమతి ఇవ్వనున్నట్లు పెద్దమనుషులు చాటింపు వేయించారు. తమ రెండు కుటుంబాలను గ్రామ పెద్దలు వెలివేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. రెండు కుటుంబాల వారు గ్రామ పెద్దలపై ఫిర్యాదు చేశారు. రెండు కుటుంబాల పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చల్లపల్లి సిఐ రవికుమార్ తెలిపారు.