Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Infosys Will Start Operations From Visakhapatnam From May 31st 2023

Infosys: ఇన్ఫోసిస్ రాకకు ముహూర్తం ఖరారు.. విశాఖలో కార్యాకలాపాలు ప్రారంభించనున్న ఐటీ దిగ్గజం..

Published Date :February 15, 2023 , 10:01 am
By Sudhakar Ravula
Infosys: ఇన్ఫోసిస్ రాకకు ముహూర్తం ఖరారు.. విశాఖలో కార్యాకలాపాలు ప్రారంభించనున్న ఐటీ దిగ్గజం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Infosys: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన పాలనను విశాఖపట్నం రాజధానిగా ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది.. త్వరలోనే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభం అవుతుందని ఇప్పటికే పలువురు మంత్రులు స్పష్టం చేశారు.. అయితే, ఇదే సమయంలో.. ఇతర సంస్థల సైతం విశాఖకు తరలివస్తున్నాయి.. ఇప్పటికే విశాఖ కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభిస్తామని ప్రకటించింది ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.. అయితే, ఇప్పుడు ఇన్ఫోసిస్ రాకకు ముహూర్తం ఖరారు చేశారు.. మే 31వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు దిగ్గజ ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌ ప్రకటించింది.. 650 మంది ఉద్యోగులతో వైజాగ్‌లో తన కార్యకలాపాలను ఆరంభించనుంది.. ఋషికొండ సిగ్నటివ్ టవర్స్ లో కార్యకలాపాలు ప్రారంభం కానుండగా.. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉన్న ఉద్యోగులకు వైజాగ్ క్యాంపస్‌లో ప్రాధాన్యత ఇస్తోంది ఇన్ఫోసిస్.

Read Also: Weather Update: నేడు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాలు.. మండనున్న ఎండలు

కాగా, విశాఖ కేంద్రంగా తొలిదశలో 1,000 మందికి ఇన్ఫోసిస్‌ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపిన విషం విదితమే.. ఇన్ఫోసిస్‌ రాక విశాఖ అభివృద్ధికి సంకేతమన్న ఆయన.. ఇప్పటికే కొన్ని ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వీరికి కావాల్సిన ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌లో ప్రభుత్వం నుంచి ఏ సహాయం కావాలన్నా అందించమని సీఎం వైఎస్ జగన్‌ ఆదేశించారని వెల్లడించారు.. వారు కోరిన విధంగా అన్ని సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తాజా ఉద్యోగులతో పాటు త్వరలో కళాశాలల్లోనే క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా కొత్త ఉద్యోగులను ఇన్ఫోసిస్‌ తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.. ఇక బీచ్‌ ఐటీ నినాదంతో విశాఖలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందనుందని మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. రానున్న కాలంలో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్‌ లాంటి సంస్థలు కూడా విశాఖ నుంచి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నామని ఆయన గతంలో వెల్లడించిన విషయం విదితమే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Infosys
  • Infosys operations
  • Visakhapatnam

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions