NTV Telugu Site icon

Vijayawada Airport: ఢిల్లీ- అమరావతి మధ్య ఇండిగో విమాన సర్వీసులు.. ఎప్పటి నుంచి అంటే..?

Indigo

Indigo

Vijayawada Airport: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి విజయవాడ మధ్య అనుసంధానం మరింత పెరుగుతోంది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతిరోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకోవడానికి తాను ఎంతగానో సంతోషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే, ఇది సాధ్యం చేసిన వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Read Also: Tata Group Chairman Meet AP CM: రేపు సీఎం చంద్రబాబుతో టాటా గ్రూపు ఛైర్మన్ భేటీ..!

కాగా, విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ప్రతి రోజు ఇండిగో విమానం ఢిల్లీకి రాకపోకలు కొనసాగించనుంది. ‘సెప్టెంబర్ 14వ తేదీ నుంచి విజయవాడ- ఢిల్లీ మధ్య రాకపోకలు స్టార్ట్ కానున్నాయి. ఈ విమానాల అనుసంధానంతో ఢిల్లీ- అమరావతి మధ్య అనుబంధం మరింత పెరగనుంది. ఈ సందర్భంగా విమాన రాకపోకల సమయాన్ని ఇండిగో విమానయాన సంస్థ వెల్లడించింది. విజయవాడ నుంచి ఢిల్లీ: బయలుదేరు సమయం ఉదయం: 11.10 గంటలకు, ఢిల్లీకి చేరుకునే సమయం మధ్యాహ్నం: 1.40 గంటలకు.. ఇక, ఢిల్లీ నుంచి విజయవాడ: బయలుదేరు సమయం రాత్రి 08.10 గంటలకు, విజయవాడకు చేరుకునే సమయం రాత్రి 10.40 గంటలుగా నిర్ధారించారు.