NTV Telugu Site icon

Heavy Rains in Andhra Pradesh: ఏపీకి ఐఎండీ ఎల్లో అలర్ట్‌.. అక్కడ రెడ్‌ అలర్ట్ జారీ

Heavy Rains

Heavy Rains

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది.. ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని ఆనుకుని తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసిన ఐఎండీ… ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది… ఈ అల్పపీడన ప్రభావంతో.. ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలలు కురుస్తాయని ఐఎండీ వర్గాలు చెబుతున్నాయి… ఇప్పటికే విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి… వర్షానికి తోడు తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి… ఇక, ఐఎండీ ఎల్లో వార్నింగ్‌ జారీ చేయడంతో… నాలుగు రోజుల పాటు చేపల వేటపై నిషేధం విధించారు అధికారులు.. ఈ సమయంలో.. ఎవరూ చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు..

Read Also: Sharan Navaratri 2022: కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి నదీ విహారానికి బ్రేక్

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని 9 రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్‌ ఇచ్చింది భారత వాతావరణశాఖ.. ఇవాళ్టి నుంచి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.. బెంగాల్, డార్జిలింగ్, కలింపొంగ్ ప్రాంతాల్లో బుధవారం నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉత్తరాఖండ్ లోని కుమాన్, గర్హాల్ ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది.