NTV Telugu Site icon

Rain Alert: ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్..!

Rain Alert

Rain Alert

Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి భాతర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడుతూ.. అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ సూచించింది. ఈ సందర్భంగా ఏపీలోని పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, కైకలూరు, తణుకులో 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇక, ఉత్తరాంధ్రలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని నిషేధం విధించింది.

Read Also: Sanju Samson: సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్‌.. ఈసారైనా మెరుస్తాడా?

అలాగే, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖ పట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ, కృష్ణ, గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అలప్పీడనం ప్రభావంతో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది. ఈ నెల 8వ తేదీ వరకు ఉత్తరాంధ్రలోనూ.. 6వ తేదీ వరకు దక్షిణ కోస్తాకు విస్తారంగా వర్షాలు కొనసాగుతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

Show comments