Heat Wave: అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాన్ ‘బిపార్జాయ్’ గుజరాత్ తీరంపై విరుచుకుపడేందుకు చూస్తోంది. రేపు గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. గుజరాత్ తో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ గోవాల రాష్ట్రాలతో పాటు డామన్ డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హావేలీ కేంద్ర పాలిత ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించింది భారతవాతావరణ శాఖ(ఐఎండీ).
Read Also: Millionaires Migration: ఇండియాను వదిలి వెళ్తున్న మిలియనీర్లు.. ఈ ఏడాది 6500 మంది వలస..
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో వేడిగాలుల పరిస్థితులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం.. రాబోయే ఐదు రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో, 24 గంటల పాటు తెలంగాణలో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని అంచానా వేసింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, రాయలసీమల్లో వేడిగాలులు, తేమ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే నాలుగు రోజుల్లో దక్షిణ ప్రాంతంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ళఉందని అంచనా వేసింది.
ఇదిలా ఉంటే బిపార్జాయ్ తుఫాన్ జూన్ 15 సాయంత్రం జఖౌ పోర్టు (గుజరాత్) సమీపంలోని మాండ్వీ, పాకిస్తాన్ లోని కరాచీ మధ్య తీరం దాతటే అవకాశం ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో 125-135 కిమీల నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు తుఫాన్ కారణంగా 50,000 మందిని తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్ వ్యాప్తంగా తీరప్రాంత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. తుఫాన్ ప్రభావం వల్ల జూన్ 16-18 వరకు గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
