కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజీల్ ధరలను తగ్గిస్తూ సామాన్యులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుందని, కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించలేదని, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అన్నారు. పెట్రోల్‌పై 5రూపాయలు, డీజీల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా పన్ను తగ్గించాలని కేంద్రం కోరిందని ఆయన తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్ను తగ్గిస్తే బీజేపీయేతర రాష్ట్రాల్లో పన్ను తగ్గించ లేద న్నారు. ఏపీలో పెట్రోల్ రేట్లు తగ్గించకపోవడం పై బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టిందన్నారు.రాష్ట్రాలు సైతం తమ వంతు బాధ్యత నిర్వహించాలని ఆయన అన్నారు.
బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా తప్పించు కుంద న్నారు. ఎన్నికలు తప్పించుకోవడం పై టీడీపీ కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయం కాబోతుం దన్నారు. గిట్టని వారు మరో వర్గం బీజేపీకి ఓటు వేశారని ప్రచారం చేస్తున్నారని ఇది సరికాదని, ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపార న్నారు. రానున్న రోజుల్లో ఏపీలో బీజేపీ సంస్థాగతంగా బలపడు తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యూపీలో బీజేపీ అఖండ విజయం సాధించే దిశగా ముందుకు వెళ్తుందన్నారు. ప్రధాన మంత్రి ఉచిత ఆహార పథకం విస్తృతంగా ఆదరణ పొందుతుందని జీవీఎల్ అన్నారు. “కరోనా” సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు బావుందని సర్వేలు చెబుతు న్నాయని ఆయన అన్నారు. “కరోనా” పేరు చెప్పి బీజేపీని విమర్శిం చే వారికి నిరాశ ఎదురవుతుందన్నారు. ఏపీలో కూడా వైసీపీకి భవిష్యత్‌లో భంగపాటు తప్పదని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యనించారు.
