Site icon NTV Telugu

IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్‌ల బదిలీ.. సీఎంవో స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య

Ias Transfers

Ias Transfers

ఓవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు.. కీలక ఐఏఎస్‌ అధికారులను కూడా బదిలీ చేసింది.. సీఎంవో స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన రెడ్డి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేశారు.. ఇక, సెలవుపై వెళ్లిన బుడితి రాజశేఖర్‌ను.. సెలవు నుంచి తిరిగొచ్చిన తర్వాత జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.. ఆర్ అండ్ బీ సెక్రటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనరుగా రాహుల్ పాండే. హౌసింగ్ స్పెషల్ సెక్రటరీగా మహ్మద్ దివాన్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. కాగా, ఐఏఎస్‌ల బదిలీ ప్రక్రియ ఎప్పుడూ సాగుతుంటే ప్రక్రియే అయినా.. ఈ సారి కీలక అధికారులు బదిలీ అయ్యారు..

Read Also: AP New CS Jawahar Reddy: కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి.. ఉత్తర్వులు జారీ..

Exit mobile version