NTV Telugu Site icon

Hyper Aadi: నా కన్నతల్లిపై ఒట్టు.. పవన్‌ లాంటి నేతను చూడలేరు..

Hyper Aadi

Hyper Aadi

Hyper Aadi: ప్రతి ఒక్కడికీ ఒక గోల్ ఉంది.. నాకు ఓ గోల్‌ ఉందని.. అది జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నోట ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే మాట వినాలని ఉందన్నారు హైపర్‌ ఆది.. రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో పాల్గొని ప్రసంగించారు.. మంత్రులపై విరుచుకుపడ్డారు.. మంత్రులకు శాఖలు ఎందుకు, పవన్ ని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండి అని సెటైర్లు వేశారు.. 150 మంది ఎమ్మెల్యేలు ఒక్కడి ముందు భయపడుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. ఇక, వారాహి యాత్రను ఆపితే పవన్ పాదయాత్ర చేస్తారు.. అప్పుడు మీకు శవయాత్రే అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.. పవన్‌ కల్యాణ్‌ కొంత కాలం కష్టపడితే ఎలాంటి పదవైనా వస్తుంది.. కానీ, పవన్‌ కల్యాణ్ అనే పదవి మాత్రం ఎవరికీ రాదన్నారు.. ఆయన స్థాయి వేరు.. ఆ స్థానం వేరు అంటూ ప్రశంసలు కురిపించారు.

Read Also: Jayasudha: దేవుడా.. 64 ఏళ్ల వయస్సులో మూడో పెళ్లి చేసుకున్న జయసుధ.. ?

పవన్‌ రెండు చోట్ల ఓడిపోయారని ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారు.. అయితే, రెండు చోట్ల ఓడిపోతేనే ఇంత మంది ప్రజలకు సహాయం చేస్తున్నారంటే.. గెలిస్తే.. మీ కష్టాన్ని కంపోడ్‌ వాల్‌ కూడా దాటనివ్వడని ప్రకటించారు హైపర్‌ ఆది.. రికార్డుల కోసమో, సంపాదన కోసమో సినిమాలు ఒప్పుకుని వ్యక్తి కాదు.. కైలు రైతులకు సాయం చేయడానికి సినిమా ఒప్పుకున్న ఏకైక హీరో పవన్‌ కల్యాణ్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఆయనకు వచ్చే ప్రతీపైసా ప్రజల కోసం ఖర్చుచేసే వ్యక్తి అని పేర్కొన్నారు.. ప్రపంచంలో ప్రతోడూ పాపులారిటీ కోసం పవన్‌ కల్యాణ్‌ను విమర్శిస్తారు.. కానీ, మీ పాపులారిటీ కోసం పవన్‌ పర్సనాల్టీని విమర్శిస్తే.. ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తుకు వస్తాడని హెచ్చరించాడు. నిలకడలేని రాజకీయం అంటూ విమర్శిస్తున్నారు.. సినిమాలు చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. పవన్‌ ఒక కులాన్ని వెనకుండి నడిపే వ్యక్తి కాదు.. అన్ని కులాలను ముందుడి నడిపించాలనుకునే వ్యక్తి పవన్‌ అన్నారు ఆది.. నన్ను కన్న నా తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. పవన్‌ కల్యాణ్‌ లాంటి నిజాయితీ, నిస్వార్థం కలిగిన, నీతివంతుడైన రాజకీయ నాయకుడిని మళ్లీ మీరు చూడలేరన్నారు హైపర్‌ ఆది.