NTV Telugu Site icon

Extramarital Affair: ప్రియురాలి కోసం భార్య హత్య.. సినిమా స్టైల్‌లో స్కెచ్.. చివర్లో ట్విస్ట్

Extramarital Affair Vizag

Extramarital Affair Vizag

Husband Killed His Wife For Extramarital Affair: వివాహేతర సంబంధాల మోజులో.. కట్టుకున్న వారినే కడతేరుస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ఓ భర్త.. తన ప్రియురాలితో కలిసి హాయిగా జీవితం సాగిద్దామని, భార్యని దారుణంగా చంపాడు. ఆపై ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం సినిమా స్టైల్‌లో పెద్ద స్కెచ్ వేశాడు. అందరినీ తన భార్యది సహజ మరణమేనని నమ్మించడానికి ప్రయత్నించాడు. కానీ.. అతని గత చరిత్రే అతడ్ని పట్టించింది. దాంతో అతడు కటకటాలపాలయ్యడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Maharashtra: దారుణం.. బాయ్‌ఫ్రెండ్‌ను చెట్టుకు కట్టేసి బాలికపై గ్యాంగ్ రేప్

విశాఖపట్నంలోని అప్పన్నపాలేనికి సమీపంలోని జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీకి చెందిన కిలాని శివ(27)కు 2017లో విజయనగరం జిల్లాకు చెందిన శ్రీదేవి (23) అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెత్త తరలించే వాహనానికి శివ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కట్ చేస్తే.. కొంతకాలం క్రితం శివకు ఒక మహిళతో పరిచయం ఏర్పడగా, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి వీళ్లిద్దరు రహస్యంగా రాసలీలలు కొనసాగించడం మొదలుపెట్టారు. అయితే.. శివ ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన శ్రీదేవి.. చివరికి తన భర్త కొనసాగిస్తున్న వివాహేతర సంబంధం గురించి తెలుసుకుంది. ఈ విషయంపై ఆమె నిలదీసింది. అయినా శివలో మార్పు రాకపోగా.. రివర్స్‌లో ఆమెనే వేధించడం మొదలుపెట్టాడు.

Bandi sanjay: రేపు విచారణకు రండి.. బండి సంజయ్ కు సిట్ మరోసారి నోటీసులు

ఈ క్రమంలో ఓసారి పుట్టింటికి వెళ్లిన శ్రీదేవి.. తన కుటుంబ సభ్యుల సహాయంతో శివపై కేసు పెట్టింది. అప్పుడు మారిపోతానని, బాగా చూసుకుంటానని మాటివ్వడంతో.. శ్రీదేవి తిరిగి కాపురానికొచ్చింది. మొదట్లో కొన్ని రోజులు శివ బాగానే ఉన్నాడు కానీ.. మళ్లీ ఆ మహిళ వద్దకు వెళ్లడం, భార్యని వేధించడం స్టార్ట్ చేశాడు. గురువారం రాత్రి కూడా భార్యతో గొడవపడిన అతడు.. అప్పుడే ఆమెని అంతమొందించాలని ప్లాన్ వేశాడు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో.. శ్రీదేవి ముఖంపై తలగడ పెట్టి, మెడకు టవల్ చుట్టి, ఊపిరి ఆడకుండా చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకొని, ఆ తర్వాత ఏమీ జరగనట్టుగా వెళ్లి బెడ్ మీద పడుకున్నాడు.

Lovers : ప్రియుడి వేధింపులు.. ప్రియురాలు ఏం చేసిందంటే..

ఉదయం అందరూ నిద్ర లేచాక.. శ్రీదేవి లేవడం లేదని, కళ్లు తిరిగి పడిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమెని ఆసుపత్రికి కూడా తరలించాడు. అయితే.. ఆమె చనిపోయి చాలాసేపు అయ్యిందని వైద్యులు నిర్ధారించారు. ఈ సమాచారం అందుకున్న శ్రీదేవి కుటుంబ సభ్యులు.. వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. శ్రీదేవి మృతి చెందిందని తెలిసి.. ఆమెది సహజ మరణం కాదని, భర్తే హత్య చేశాడని వాళ్లు ఆరోపించారు. గతంలోనూ శివపై ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలిపారు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. వివాహేతర సంబంధం కోసం తానే శ్రీదేవిని చంపినట్టు శివ ఒప్పుకున్నాడు.

Show comments