NTV Telugu Site icon

దిశా యాప్ ఇలా డౌన్‌లోడ్ చేసుకుందాం…ఉప‌యోగాలు ఇవే…

ఏపీ ప్ర‌భుత్వం గ‌తెడాది ఫిబ్ర‌వ‌రిలో దిశాయాప్‌ను రూపోందించి విడుద‌ల చేసింది.  దీనికి సంబందించి చ‌ట్టాన్ని, దిశా పోలీస్ స్టేష‌న్ల‌ను కూడా తీసుకొచ్చింది.  దిశా యాప్‌పై విస్తృత‌మైన అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సిద్ద‌మైంది.  ప్ర‌తి మ‌హిళ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తెలిపారు.  ఇక ఈ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి… ఎలా ఉప‌యోగించాలో చూద్దాం.

Read: అర్జున్ “ఆంజనేయస్వామి గుడి” ప్రారంభం..జులై 1న కుంభాభిషేకం.

దిశాయాప్ ఆండ్రాయిడ్ వెర్ష‌న్‌ను ప్లేస్టోర్ ద్వారా, ఐఓఎస్ వెర్ష‌న్‌ను యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.  డౌన్‌లోడ్ చేసుకున్నాక మొబైల్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయ‌గానే ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీ స‌బ్మిట్ చేసిన త‌రువాత వ్య‌క్తిగ‌త వివ‌రాలు, అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో స‌మ‌యం అందించేందుకు వీలుగా అద‌న‌పు కుటుంబ స‌భ్యుల మొబైల్ నెంబ‌ర్లు ఇవ్వాలి.  మహిళ‌లు ఆప‌దలో ఉన్నామ‌ని భావించిన‌పుడు యాప్ లోని ఎస్ఓఎస్ బ‌ట‌న్ ప్రెస్ చేస్తే 10 సెకన్ల వీడియోతో పాటు, మొబైల్ లోకేష‌న్ తో దిశా క‌మాండ్ కంట్రోల్ రూమ్‌కు స‌మాచారం వెళ్తుంది.  సిబ్బంది ద‌గ్గ‌ర‌లోని పోలీసుల‌కు అల‌ర్ట్ చేయ‌డం ద్వారా నిమిషాల వ్వ‌వ‌ధిలో మ‌హిళ‌ల‌ను ఆప‌ద నుంచి ర‌క్షించే అవ‌కాశం ఉంటుంది.  

Read: మోహన్ బాబు ఆవిష్కరించిన ‘రామబాణం’
అంతేకాదు, ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో ర‌క్ష‌ణ‌కోసం ట్రాక్ మై ట్రావెల్ అనే అప్ష‌న్ లో గమ్య‌స్థానం వివ‌రాలు ఎంట‌ర్ చేస్తే, ఆమె ప్ర‌యాణం పూర్త‌య్యే వ‌ర‌కు అనుక్ష‌ణం ట్రాకింగ్ జ‌రుగుతుంది.  వాహ‌నం మార్గం మారినా, ఎదైనా ప్ర‌మాదం జ‌రిగినా వెంట‌నే సిబ్బందిని అల‌ర్ట్ చేస్తుంది.  మ‌హిళ‌లకు పూర్తిస్థాయి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ఈ యాప్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.  

Show comments