Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record How Did Sarvadarshana Suddenly Start In Thirumala

తిరుమలలో సర్వదర్శనం సడన్‌గా ఎలా ప్రారంభమైంది ?

Published Date :September 15, 2021 , 10:01 pm
By Lakshmi Narayana
తిరుమలలో సర్వదర్శనం సడన్‌గా ఎలా ప్రారంభమైంది ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తిరుమల శ్రీవారి ఆలయంలో 5 నెలలుగా నిలిచిన సర్వదర్శనం సడెన్‌గా ఎలా ప్రారంభమైంది? టీటీడీ ప్రయోగాత్మక పరిశీలన కూడా పూర్తికాని.. సంప్రదాయ భోజన పథకం ఎందుకు ఆగిపోయింది? ఈ రెండు నిర్ణయాల వెనక ఉన్నది ఎవరు? టీటీడీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?

తిరుమలలో ఆగమశాస్త్రానికే పెద్దపీట..!

కలియుగ వైకుంఠనాధుడి సన్నిధిలో చిన్నపాటి మార్పులు చేయాలంటే ఎన్నో అడ్డంకులు దాటాలి. మరేన్నో వివరణలు ఇచ్చుకోవాలి. అధికారులకు నచ్చిందనో.. పాలకమండలి మెచ్చిందనో.. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని అమలుచేసే పరిస్థితి శ్రీవారి ఆలయంలో ఉండదు. వెయ్యేళ్ల క్రితం రామానుజాచార్యులు నిర్దేశించిన విధంగా.. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్ర్త ప్రకారం పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యార్ధం పేరుతో కొన్నిసార్లు ఆగమశాస్ర్తాన్ని దాటి నిర్ణయాలు తీసుకున్నా.. మఠాధిపతులు, పీఠాధిపతులు నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనక్కి తగ్గక తప్పలేదు. శ్రీవారి ఆలయంలో నేత్ర ద్వారాలు.. భక్తులను తరలించేందుకు మెట్లమార్గం ఏర్పాటు .. స్వామివారి కళ్యాణోత్సవ సేవను ఆలయం వెలుపలికి తరలించేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఉండటంతో వెనక్కి తగ్గింది టీటీడీ.

కరోనా కారణంగా ఏప్రిల్‌లో సర్వదర్శనం ఆపేశారు!
సంప్రదాయ భోజనంపై ప్రయోగాత్మక పరిశీలన!

కరోనా కారణంగా తిరుమల ఆలయంలో దర్శనాలను నియంత్రించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలోనే సర్వదర్శనం క్యూ లైన్‌ను నిలిపివేసింది. ఇప్పుడు దేశంలో కరోన తీవ్రత తగ్గింది. విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలను ఓపెన్‌ చేశారు. అన్నీ పూర్వస్థితికి చేరుకుంటున్న తరుణంలో శ్రీవారి ఆలయంలో సర్వ దర్శనం ప్రారంభం కాలేదు. ఇదే అంశాన్ని భక్తులు పలుమార్లు టీటీడీ దృష్టికి తీసుకెళ్లినా.. ఇప్పట్లో సాధ్యం కాదనే సమాధానం వచ్చింది. ఇక గో ఆధారిత సాగుద్వారా పండించిన పదార్ధాలతో భక్తులకు సంప్రదాయ భోజనం అందించాలని ఆ మధ్య టీటీడీ నిర్ణయించింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సంప్రదాయ భోజనాన్ని కాస్ట్‌ టు కాస్ట్‌ ప్రాతిపదికన భక్తులకు అందించాలని భావించారు. ప్రయోగాత్మకంగా పరిశీలించారు కూడా. కానీ.. సంప్రదాయ భోజన కార్యక్రమం ఆగిపోయింది. ఇప్పట్లో సాధ్యం కాదన్న సర్వదర్శనం కూడా మొదలైంది. దీంతో ఈ రెండు కీలక నిర్ణయాల వెనక ఎవరు ఉన్నారు అని చర్చించుకుంటున్నారు.

సర్వదర్శనం ప్రారంభించాలని స్వామీజీ సూచన!
సంప్రదాయ భోజనం విక్రయం సరికాదన్న స్వామీజీ!

టీటీడీకి రెండోసారి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి సతీ సమేతంగా వెళ్లి.. చాతుర్మాస దీక్షలో ఉన్న ఓ స్వామీజి ఆశీస్సులు తీసుకున్నారట. ఆ సందర్భంగా సామాన్య భక్తులకు కూడా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించాలని.. సర్వదర్శనం ప్రారంభించాలని స్వామీజీ సూచించారట. ఆ సమయంలోనే సంప్రదాయ భోజనం ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. సంప్రదాయ భోజనం పేరిట అన్న ప్రసాదాల విక్రయాలు మంచి సంప్రదాయం కాదని స్వామీజీ వారించారట. అలా స్వామీజీ చెప్పిన తర్వాతే తిరుమల కొండపై ఈ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. సర్వదర్శనం ప్రారంభించడమే కాదు.. ఆన్‌లైన్‌లో టికెట్ల జారీకి చొరవ తీసుకుంటోంది టీటీడీ. ఇక విమర్శలకు ఆస్కారం ఇచ్చిన సంప్రదాయ భోజన విక్రయానికి స్వస్తి చెప్పింది. దీంతో టీటీడీ ఆలోచనలను ఒక్క మాటతో స్వామీజీ మార్చేశారని అనుకుంటున్నారట.

స్వామీజీ ఇతర సూచనలు పట్టాలెక్కబోతున్నాయా?

గతంలో గిరిజన, హరిజన ప్రాంతాల్లో టీటీడీ భజన మండళ్లు నిర్వహించేది. దానిని తిరిగి ప్రారంభించాలని కూడా స్వామీజీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సూచించారట. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల కేంద్రాలుగా హిందూ ధర్మప్రచారం విస్తృతం చేయాలని కూడా హితవు పలికారట స్వామీజీ. త్వరలో ఇవి కూడా పట్టాలెక్కుతాయని కొండపై టాక్‌. మొత్తానికి ఒక్క మాట.. వచ్చిన మార్పులే తిరుమలలో చర్చగా మారాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • off the record
  • tirumala
  • ttd

తాజావార్తలు

  • Chaitanyapuri Fraud Case: కోట్లలో వరకట్నం, ఘనంగా నిశ్చితార్థం.. చైతన్యపురిలో నకిలీ ఎఫ్‌సీఐ ఉద్యోగి దొరికిపోయాడిలా!

  • Onion Pickle Recipe: క్షణాల్లో ఉల్లిపాయ పచ్చడి రెడీ.. ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ అడుగుతారు అంతే..!

  • Sensex Crash: ట్రంప్ ‘దిగ్బంధనం’ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 105 డాలర్లకు చేరిన ముడి చమురు!

  • Mangli:రూ.10 కోట్ల మోసం ఆరోపణలపై.. కన్నీళ్లు పెట్టుకుంటూ క్లారిటీ ఇచ్చిన మంగ్లీ..

  • Andhra Pradesh: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. మంత్రులకు సింగపూర్‌లో ట్రైనింగ్..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions