NTV Telugu Site icon

ఆనంద‌య్య చుక్క‌ల మందు… ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశం

Anandaiah

ఆనంద‌య్య మందుకు అనుమ‌తి ఇచ్చిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. ఇదే స‌మ‌యంలో.. కంట్లో వేసే చుక్క‌ల‌ మందుకు అనుమ‌తి నిరాక‌రించింది.. దీంతో.. కంట్లోవేసే చుక్కుల మందుకు కూడా అనుమ‌తి ఇవ్వాల‌ని హైకోర్టును కోరారు ఆనంద‌య్య త‌ర‌పు న్యాయ‌వాది.. ఆ మందుపై నివేదిక‌ను గురువారం లోగా అందించాల‌ని హైకోర్టు వ్యాఖ్యానించ‌గా.. కంట్లో వేసే చుక్కులు కె అనే మందును అనుమ‌తించ‌క‌పోవ‌డానికి శాంపిల్ ఇవ్వ‌క‌పోవ‌మే కార‌ణంగా చెప్పింది ప్ర‌భుత్వం.. అయితే, ఈ రోజు కె మందు శాంపిల్ ఇస్తామ‌ని తెలిపారు ఆనంద‌య్య న్యాయ‌వాది.. కానీ, ప్ర‌భుత్వం రెండు వారాల స‌మ‌యం కోర‌గా.. గురువారం లోగా ఆ నివేదిక‌ను అందించాల్సిందేన‌ని ఆదేశించింది. దీంతో.. త‌దుప‌రి విచార‌ణ‌ను గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు… ఇక‌, విచార‌ణ సంద‌ర్భంగా.. మందు త‌యారీకి అవ‌స‌ర‌మైన వ‌న‌మూలిక‌ల విష‌యంలో ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాల‌ని ఆనంద‌య్య త‌ర‌పు న్యాయ‌వాది హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.. మ‌రోవైపు.., మందు పంపిణీకి సంబంధించిన ఏర్పాట్ల‌ను పోలీసులు స‌హ‌క‌రించాల‌ని హైకోర్టు పేర్కొంది.. నెల్లూరు ఎస్పీ.. ఆనంద‌య్య‌ను క‌లిసి.. దీనిపై చ‌ర్చించాల‌ని పేర్కొంది. ఇప్ప‌టికే.. ఆనంద‌య్య త‌యారు చేసే పీ, ఎల్‌, ఎఫ్ అనే మందుల‌కు అనుమ‌తి రాగా… ఇప్పుడు క‌ళ్ల‌లో వేసి కె అనే మందుకు గ్రీన్ సిగ్న‌ల్ రావాల్సి ఉంది. క‌రోనా బాధితులకు ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోయిన‌ప్పుడు.. క‌ళ్ల‌లో చుక్కులు వేసిన కొద్ది క్ష‌ణాల్లోనే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరిగుతున్న‌ట్టు ప‌లువురు కోవిడ్ బాధితులు తెలిపిన సంగ‌తి తెలిసిందే.