NTV Telugu Site icon

Movie Tickets: ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయం.. హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

Movie Tickets

Movie Tickets

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లను విక్రయించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. అయితే, దీనికి కొన్ని అడ్డంకులు వచ్చాయి.. దీంతో, ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం అమలు చేస్తారా? అనే అనుమానాలు కలిగినా.. ఇప్పుడా ఆ సస్పెన్స్‌ కు తెరపడినట్టు అయ్యింది.. ప్రభుత్వ సినిమా టికెట్ల విధానానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆన్ లైన్ సినిమా టికెట్ల అంశంపై మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం.. మల్టిప్లెక్స్ యాజమాన్యాలు సొంత వేదికలపై టికెట్లను విక్రయించుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వలేమని స్పష్టం చేసింది..

Read Also: Ragging: ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం.. నమస్తే పెట్టలేదని..!

ఇక, ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం తెచ్చిన విధానం ఎలా ఉంటుందో కొన్నాళ్లు వేచి చూద్దామని ఈ సందర్భంగా అభిప్రాయపడింది హైకోర్టు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆన్ లైన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు విక్రయించుకోవచ్చని పేర్కొంది హైకోర్టు.. ఈ అంశంలో మల్టిప్లెక్స్ యాజమాన్యాల అభ్యర్థనను తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలిపింది. ఇక, ఈ కేసులో తదువరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.