NTV Telugu Site icon

Tirumala: తిరుమలకు వెళుతున్నారా.. ఒక్క క్షణం ఆగండి

Ttd1

Ttd1

వేసవి సెలవులు నడుస్తుండడంతో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు కీలక సూచనలు అందించారు. భక్తుల రద్దీ కారణంగా దర్శనాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందిస్తున్నామని, స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఆహారం, తాగేందుకు నీరు అందిస్తున్నామన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు కూడా రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామి వారి దర్శనానికి రావాలని కోరారు. తమ షెడ్యూల్ మార్చుకోవాలని, రద్దీ వల్ల పిల్లలతో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ఈ విషయంలో టీటీడీని నిందించవద్దన్నారు టీటీడీ ఛైర్మన్.

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు. సర్వదర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది. అంటే దర్శనం కోసం తిరుమల వెళితే రెండురోజులు క్యూలైన్లలో వేచి వుండాల్సిన పరిస్థితి.

నిన్న శ్రీవారిని 89,318 మంది భక్తులు దర్శించున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తులు 48,539 మంది వున్నారు. అంటే రోజు రోజుకీ భక్తుల తాకిడి ఎక్కువ అవుతోంది. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లుగా టీటీడీ వెల్లడించింది. ఇవాళ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల వరకూ క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనంకు 36 గంటల సమయం పడుతోంది.

Telangana: రేటు పెరిగింది.. ‘కిక్కు’ త‌గ్గింది