మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నైరుతి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, విశాఖ, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. పలుచోట్ల ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ ఈదురు గాలులకు కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి.
అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఇప్పటికే వర్షాకాలం ముందుస్తు ప్రణాళికలను సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేసుకున్నారు. వరదనీటిని తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. విశాఖపట్నం తీరంలో కూడా భారీగా వర్షం కురుస్తోంది.