Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Heavy Rains For Three Days In Ap Farmers And Agricultural Laborers Should Be Alert

AP Weather Update: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు.. రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలి

Published Date :July 3, 2023 , 12:22 pm
By Naga Maneendra
AP Weather Update: ఏపీలో  మూడు రోజులపాటు భారీ వర్షాలు.. రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Weather Update: ఆంధ్రప్రదేశ్‌లో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు. అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎసస్సార్ కడప జిల్లాలో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అలాగే పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాలో మంగళ వారం రోజు వర్షాలు కురవనున్నాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతా రామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్సీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీసత్య సాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో బుధవారం రోజు కూడా వర్షాలు కురవబోతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Read also: Kodak CA Pro 65-inch TV: అతి తక్కువ ధరకే 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. బెస్ట్ ఫీచర్స్!

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. జూలై 4 మధ్యాహ్నం నుంచి జూలై 7 ఉదయం మధ్యలో ఆంధ్ర​, తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడనం వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా జూలై 4, 5 న మధ్య ఆంధ్ర జిల్లాలైన బాపట్ల, ఎన్.టీ.ఆర్ (విజయవాడ తో పాటుగా), కృష్ణా, ఏలూరు, కోనసీమ​, ఏలూరు, ఉత్తర ప్రకాశం, పల్నాడు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటుగా కర్నూలు, నంధ్యాల​, అనకాపల్లి జిల్లాల్లో విస్తారంగా.. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. విశాఖ​, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం, నెల్లూరు, తిరుపతి, కడప​, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య​, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alert
  • ap
  • Heavy rains
  • three days
  • weather update

తాజావార్తలు

  • Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!

  • బంతి దొరికిందిరోయ్.. స్టేడియం బయట RCB Fans సందడి మాములుగా లేదుగా.. వీడియో వైరల్!

  • MK Stalin: మదురైని మణిపూర్‌లా మార్చాలనుకున్నారు.. బీజేపీపై స్టాలిన్ విమర్శలు..

  • RCB-BCCI: ఆర్‌సీబీకి బీసీసీఐ మద్దతు.. అందుకేనా ఈ వరుస విజయాలు?

  • New Railway Line: తెలంగాణ, ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే ప్రాజెక్ట్‌పై అప్‌డేట్..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions