Site icon NTV Telugu

తిరుమలలో వర్షం.. ఘాట్ రోడ్ పై వెళ్లే వారికి వార్నింగ్

తిరుమలలో కురిసిన భారీవర్షానికి భక్తులు తడిసిముద్దయ్యారు. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు గురి అయ్యారు.. సెలవు రోజు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటుగా దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు తడిసిపోయారు.

భారీవర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు, లడ్డూ వితరణ కేంద్రాల్లో స్వల్పంగా వర్షపు నీరు చేరుకుంది. వాన నీటిని బయటకు తోడే పనిలో టీటీడీ సిబ్బంది బిజీగా వున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో, మొదటి, రెండవ ఘాట్ రోడ్డులలో ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తంగా వుండాలని టీటీడీ వార్నింగ్ ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్ లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది.

Read Also కొరియా వ్యాధి గురించి ఎప్పుడైనా విన్నారా?

Exit mobile version